Rooster Attacks Man: మనుషులతో కోడిపెట్టలు ఉన్నంత ఫ్రెండ్లీగా కోడి పుంజులు ఉండవంటుంటారు. కోడిపెట్టలు మనుషులతో మమేకమై.. వారితో కలిసి జీవిస్తుంటాయి. కానీ కోడి పుంజులు ఇందుకు కొంచెం భిన్నం అనే చెప్పుకోవచ్చు. కోడిపెట్టలకు ఉన్నంత కూల్ నేచర్ కోడి పుంజులకు ఉండదు. వీటికి కొంత దూకుడు స్వభావం ఎక్కువ. కోపం కూడా ఎక్కువే. అందుకే కోడి పందాల్లో పుంజులను విరివిగా ఉపయోగించడం చూస్తుంటాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయినా ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నట్టు, ఈ కోడి పురాణం ఎందుకు అని అనుకుంటున్నారా ? అయితే ఇదిగో ఈ ఫన్నీ వైరల్ వీడియో చూడండి.. కోడి పెట్టల కంటే కోడి పుంజుల స్వభావం కొంత అగ్రెసివ్ గా ఉంటుందని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందో మీకే అర్థం అవుతుంది. 



 


చూశారు కదా.. కోడిని కొట్టి దాన్ని ఆటపట్టించి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు ఓ యువకుడు. కానీ నేనలా బెదిరే రకం కాదు అంటూ రివర్స్ తిరిగి ముందుకు దూకి బెదిరించింది ఆ కోడి పుంజు. కోడి పుంజే కదా ఏమవుతుందిలే అని లైట్ తీసుకున్న ఆ యువకుడు ఊహించని పరిణామానికి ఖంగు తిన్నాడు. కళ్లు మూసి తెరిచే లోగా మెరుపు వేగంతో అక్కడి నుంచి పరుగు అందుకున్నాడు. కోడిపుంజు దూకుడు చూసి దడుసుకున్న యువకుడు ఆ భయంతో ఎటువైపు పరిగెడుతున్నాడో కూడా చూడకుండా పరిగెత్తాడు. ఆ కంగారులో కిందున్న చిన్నపాటి లోయలో పడిపోయాడు. అంతకంటే ముందుగా చెట్టుపై పడిపోయాడు. ఆ చెట్టు కొమ్మను పట్టుకుని వేళ్లాడుతూ కిందపడ్డాడు. అక్కడ కూడా ఆగకుండా, వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు.


ఈ యువకుడి ఫన్నీ వీడియో చూసిన నెటిజెన్స్ ఫక్కున నవ్వుకుంటున్నారు. నోరు లేని జీవిని కట్టెతో కొట్టి ఇబ్బంది పెట్టాలనుకున్న యువకుడికి ఇన్‌స్టాంట్ కర్మ లభించింది అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. అందుకే మూగజీవాల జోలికి వెళ్లొద్దంటూ ఇంకొంతమంది సలహా ఇచ్చారు. అంతేకాదండోయ్.. ఇప్పుడు కోడిపుంజును చూసి కోడిలా పరిగెత్తింది ఎవరు అంటూ వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫన్నీ వీడియో ( Funny Video ) ఫుల్ వైరల్ అవుతోంది.


Also Read : Python Viral Video: వామ్మో!! 20 అడుగుల భారీ కొండచిలువ మనిషిని ఎలా నలిపేస్తుందో చూడండి


Also Read : Lizard Eating Watermelon: బల్లితో కలిసి పుచ్చకాయ తింటున్నాడు.. వైరల్ వీడియో


Also Read : Crocodile Attacks Cow: నీళ్లు తాగడానికి వచ్చిన ఆవును పట్టిన మొసలి.. తర్వాతేం జరిగిందో మీరే చూడండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook