Apple Pakoda: సోషల్ మీడియాలో రకరకాల వింత వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. సాధారణంగా మన జీవితంలో చూడని ఎన్నో వింతలు ఈ వీడియోలలో మనకు కనిపిస్తాయి. ఇంటర్నెట్‌లో మనం చూసే వీడియోలలోని అనేక విషయాలు కొన్నిసార్లు మనల్ని నవ్విస్తాయి. కొన్నిసార్లు మనల్ని ఆలోచింపజేస్తాయి.. కొన్నిసార్లు ఆశ్చర్యపరుస్తాయి.. కొన్నిసార్లు మనల్ని బాధపెడతాయి. అలాంటి ఓ ఆసక్తికరమైన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రజలు వింతైన వంటకాలను తయారుచేసే వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవడం ప్రారంభించాయి. ఫాంటా మ్యాగీ నుండి ఫైర్ మోమోస్ వరకు.. ఆన్‌లైన్‌లో అనేక విన్నూతంగా ప్రయత్నించిన వంటకాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ఆపిల్ ను డీప్ ఫ్రై చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 


వాట్ హౌ ట్రై అనే ఇన్ స్టాగ్రామ్ పేజీ ద్వారా ఇప్పుడు వైరల్ అవుతున్న క్లిప్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి ఆపిల్ పై పిండి పూసి దాన్ని నూనెలో డీప్ ఫ్రై చేశాడు. ఆ తర్వాత దాన్ని బయటకు తీసి సగానికి కట్ చేసి కెమెరాకు చూపించాడు. ఆ ఆపిల్ పకోడాను రుచి చూసి బాగుందని రివ్యూ ఇచ్చాడు. 


ఈ ఆపిల్ పకోడా వీడియోను ఆన్ లైన్ లో పోస్ట్ చేసిన తర్వాత.. దానికి 3 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఆపిల్ పకోడా కాన్సెప్ట్ కొందరికి నచ్చగా.. మరి కొందర్ని పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంకెందుకు ఆలస్యం ఆపిల్ పకోడా తయారు చేసి విధానాన్ని మీరూ చూసేయండి.   



 


 


ALso Read: Viral Video: పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్‌..షాక్‌కు గురి చేస్తున్న వీడియో


Also Read: IR Camera Through Clothes: వావ్! ఈ స్మార్ట్ ఫోన్ తో లోదుస్తులను స్కాన్ చేయేచ్చు- అదెలాగో తెలుసుకోండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook