Baby Elephant Fell Into Well: కంటతడి పెట్టించే వీడియో.. 30 అడుగుల బావిలో ఏనుగు పిల్ల నరకయాతన.. వీడియో వైరల్..!
Baby Elephant Viral Video: నీలగిరి జిల్లా కోలపల్లి ప్రాంతంలోని బావిలో ఏనుగు పిల్ల పడిపోయింది. బయటకు రావడానికి ఏనుగు పిల్ల అష్టకష్టాలు పడింది. ప్రస్తుతం జేసీపీ సాయంతో ఏనుగు పిల్లను బయటకు తీసుకొచ్చేందుకు అటవీశాఖ నిమగ్నమైంది.
Baby Elephant Viral Video: సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటాయి. అలాంటి వీడియోలలో ఒకటి ఏనుగు పిల్ల బావిలో పడిపోయిన వీడియో నెట్టింట వైరన్ అవుతుంది. ఈ వీడియో చూసిన వారందరూ చాలా ఆందోళనకు గురవుతున్నారు. వీడియోలో బావిలో పడిపోయిన ఏనుగు పిల్ల బయటపడటానికి ప్రయత్నిస్తూ కనిపిస్తుంది. ఈ ఏనుగు పిల్ల ఆ బావిలోకి ఎలా పడిపోయిందని అందరూ టెన్షన్ పడిపోతున్నారు. అది ఎలా బయటకు వస్తుంది..? రావడానికి దారిలేని గొయి లోపల నుంచి ఎలా రక్షించారు..? అనేది ఆసక్తిగా మారింది.
నీలగిరి జిల్లా కోలపల్లిలోని కురింజి నగర్‌లో ఆహారం, నీటి కోసం ఏనుగుల గుంపు అడవిలో తిరుగుతోంది. ఈ సమయంలో గుంపులోని ఓ ఏనుగు పిల్ల సమీపంలోని 30 అడుగుల లోతైన బావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. ఊహించనివిధంగా లోపలకు పడిపోయిన ఏనుగు పిల్ల బయటకు వచ్చేందుకు శతవిధాల ప్రయత్నించింది. అష్టకష్టాలు పడినా.. పైకి వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో డీలా పడిపోయింది. ఆ ఏనుగు పిల్లను రక్షించేందుకు తల్లి ఏనుగు, గుంపులోని ఇతర ఏనుగులు పెద్ద శబ్దంతో భీకరంగా శబ్దాలు చేశాయి.
ఈ శబ్దాలు విన్న స్థానిక ప్రజలు తెల్లవారుజామున ఆ బావి వద్దకు చేరుకున్నారు. బావి దగ్గర ఉన్న ఏనుగుల గుంపును చూసి.. టెన్షన్‌తో అక్కడికి వెళ్లి చూశారు. బావి లోపల ఏనుగు పిల్ల కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. వారు వెంటనే అటవీశాఖకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న ఏనుగుల గుంపును పక్కకు పంపించి.. ఏనుగు పిల్లలను జేసీబీ సాయంతో రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన వారందరూ ఏనుగు పిల్ల పట్ల చాలా జాలి పడుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏనుగు పిల్ల పట్ల చాలా సానుభూతి చూపుతున్నారు. ప్రస్తుతం ఇంకా ఏనుగు పిల్లను తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సురక్షితంగా బయటకు తీసుకురావాలని ప్రార్థిస్తున్నారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి