Baby Monkey Girl Viral Video: మానవ మమ్మీ నుంచి బేబీ కోతి దూరం.. హృదయాలను కదిలించే వీడియో!
Viral Video, Baby Monkey cried after Separated From Young Girl. తల్లిదండ్రుల, పిల్లల అనుబంధం కేవలం మానవులకే కాదు.. జంతువులకు కూడా ఉంటుంది. మానవ మమ్మీ నుంచి విడిపోయిన ఓ బేబీ కోతి ఏడ్చేసింది.
Viral Video, Baby Monkey cried after Separated From Human Mommy: తల్లిదండ్రులకు వారి పిల్లలే ప్రపంచం. తాము తిన్నా, తినకున్నా పిల్లలకు మాత్రం మూడు పూటలా అన్నం పెడుతారు. పిల్లలకు చిన్న దెబ్బతికినా తల్లడిలిపోతారు. పిల్ల కోసం ఎంతటి కష్టానైనా భరిస్తారు. అదే సమయంలో పిల్లలు కూడా తమ తల్లిదండ్రులపై ఎంతో మమకారం పెంచుకుంటారు. పిల్లలు తమకు దూరమయినప్పుడు తల్లిదండ్రులు తట్టుకోలేరు. ఈ అనుబంధం కేవలం మానవులకే కాదు.. జంతువులకు కూడా ఉంటుంది. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మానవ మమ్మీ నుంచి విడిపోయిన ఓ బేబీ కోతి ఏడ్చేసింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... ఓ బేబీ కోతి ఒక యువతిని పట్టుకుంది ఉంటుంది. అక్కడే ఉన్న ఓ స్త్రీ వచ్చి బేబీ కోతిని తన చేతులోకి తీసుకుంటుంది. వెంటనే ఆ బేబీ కోతి ఏడవడం ఆరంభిస్తుంది. ఎంత ఊరుకించినా అస్సలు ఆగదు. దాంతో చేసేదేం లేక యువతి తన చేతులు చెపుతుంది. చిన్న పిల్లలు ఎలా అయితే వస్తారో.. అచ్చు అలానే ఆ బేబీ కోతి యువతి చేతులను పట్టుకుంటుంది. యువతి తీసుకోగానే.. కోతి ఆమెను గట్టిగా హత్తుకుని ఏడుపు ఆపేస్తుంది.
యువతి వద్దకు రాగానే బేబీ కోతి నిశ్శబ్దంగా ఉండిపోతుంది. అంతేకాదు బేబీ కోతి ముఖంలో ప్రేమ మరియు అనుబంధం కనిపిస్తుంటుంది. యువతిని ఆ కోతి తన తల్లిలా భావించింది. అందుకే అది ఆమె నుంచి విడిపోవడానికి ఇష్టపడలేదు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మోహిత్ విజ్ (Mohit Vijh) అనే ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేయబడింది. ఒకరోజు క్రితం అప్లోడ్ చేసిన ఈ వీడియోకి వేలల్లో వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోకు నెటిజన్లు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.