Young Man Cleverly Escaped from a Bear Attack on a Tree: ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్ద వయస్సు వారి వరకు ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. సరైన సమయానికి తిండి తినకుండా అయినా ఉంటున్నారు కానీ.. స్మార్ట్ ఫోన్ కాలక్షేపం లేనిది మాత్రం అస్సలు ఉండడం లేదు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ట్రెండ్ అయ్యే వీడియోస్ చూస్తూ.. తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువగా జంతులకు సంబదించిన వీడియోస్ చూస్తూ తెగ నవ్వుకుంటున్నారు.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో ఎక్కువగా జంతులకు సంబదించిన వీడియోస్ చక్కర్లు కొడుతుంటాయి. సింహం, చిరుత, ఏనుగు, కుక్క, మొసలి, ఎలుగుబంటి, పిల్లి, పాములకు సంబందించినవి తెగ వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోస్ ఆశ్చర్యానికి గురిచేస్తే.. మరికొన్ని భయానకరంగా ఉంటాయి. మరికొన్ని వీడియోస్ మాత్రం చాలా ఫన్నీగా ఉంటాయి. అలాంటి వీడీయోనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఎలుగుబంటి దాడి నుంచి ఓ వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు. 


ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... అడవి ప్రాంతంలో ఓ వ్యక్తి బ్యాగ్ వేసుకుని వెళుతుంటాడు. అటుగా వెళుతున్న ఓ భారీ ఎలుగుబంటిన చూసి భయపడిపోతాడు. ఆ వ్యక్తిని ఎలుగుబంటి చూసి దగ్గరికి వస్తుంది. తప్పించుకోవడానికి వీలులేని సమయంలో ఆ వ్యక్తి పక్కనే ఉన్న చెట్టు ఎక్కుతుంటాడు. ఇది గమనించిన ఎలుగుబంటి అతడిని అందుకునేందుకు చెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. ఆ వ్యక్తి తొందరగా ఎక్కుతున్నా.. అతడి కాలును అందుకుంటుంది. ఎలుగుబంటి దాడి నుంచి తప్పించుకున్న ఆ వ్యక్తి పూర్తిగా చెట్టు ఎక్కేస్తాడు. ఎలుగుబంటి మాత్రం కిందే ఉండిపోతుంది. 



ఎలుగుబంటి దాడి నుంచి మనిషి తప్పించుకున్న వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను 'animals_powers' అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూసర్ పోస్ట్ చేశాడు. ఒకరోజు క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటివరకు 5 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాదు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఆలస్యం ఎందుకు ఈ వీడియోని మీరు చూసి ఎంజాయ్ చేయండి. 


Also Read: Street Dogs Kills Boy: అంబర్ పేటలో విషాదం.. నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి! తీవ్ర గాయాలతో మృతి  


Also Read: విరాట్ కోహ్లీకి లిప్ కిస్ ఇచ్చిన యువతి.. సెన్సెషనల్ వీడియో చూడాల్సిందే! పాపం అనుష్క



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook