Online Order: ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ వినియోగం చాలా ఎక్కువ అయిందని చెప్పవచ్చు. ఇది వరకు ఏం కావాలన్న మార్కెట్ లేదా షాప్ లకి వెళ్లి నచ్చింది చూసి, కొనేవాళ్లం కానీ ఇపుడు చాలా మంది వస్తువులను ఆన్‌లైన్ లో ఆర్డర్ చేస్తూ ఇంటికి తెప్పించుకుంటూన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల అమెజాన్, ఫ్లిప్ కార్ట్ పండగ సీజన్ కారణంగా ఆఫర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే, నిజానికి ఈ ఆఫర్ల కోసమే చాలా మంది ధర తక్కువ వస్తుందన్న ఉద్దేశంతో గత కొంత కాలంగా వస్తువులను కొనకుండా ఈ ఆఫర్ లో కొనటానికి వేచి చూస్తుంటారు. 


Also Read: Telangana RTC: ఆర్టీసీ సరికొత్త సేవలు, ఫోన్ చేస్తే ఇంటి వద్దకే బస్సు


వీటికి తగ్గట్టు గానే ఈ కామర్స్ సంస్థలన్నీ యూసర్లను ఆకట్టుకోటానికి అనేక రకాల క్యాష్ బ్యాక్ ఆఫర్లను, డిస్కౌంట్‌లను ప్రకటిస్తున్నాయి. కానీ ఇలాంటి ఆఫర్లకు ఆకర్షితమై ఆర్డర్ చేసిన వ్యక్తులకు చేదు అనుభవం ఎదురైంది 


రాహుల్ సింగ్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో 20000mah పవర్ బ్యాంక్ ఆర్డర్ చేశాడు, అనుకున్న విధంగా ఆర్డర్ రానే వచ్చింది, వచ్చిన ఆర్డర్ ను ఏంటో ఆతృతగా తెరచి చూసాడు. చూసిన వెంటనే షాక్ తగిలింది.. ఎందుకంటే ఆర్డర్ చేసిన 20000mah పవర్ బ్యాంక్  బదులుగా అందులో ఒక ఇటుక ముక్క రావటం... వెంటనే ట్విట్టర్ వేదికగా "ఫ్లిప్ కార్ట్ కు ధన్యవాదములు... 20000mah పవర్ బ్యాంక్  బదులుగా ఇటుక అక్కను పంపినందుకు.. హ్యాట్ ఆఫ్ టూ బిగ్ బిలియన్ డేస్" అని తన ఆర్డర్ ఐడీని జోడించాడు. 




రజత్ సింగల్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో రియల్ మి ఇయర్ బడ్స్ ఆర్డర్ చేస్తే డెటాల్ సబ్బు వచ్చింది.


Also Read:  Bathukamma 2021 festival: బతుకమ్మ పండగ సంబరాలు షురూ









ఇది చూసి చాలా మంది తాము ఆర్డర్ చేసిన దానికి బదులుగా వేరే పొందిన వస్తువుల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook