Android Apps: టెక్నాలజీ కాలంలో ఏదైనా యాప్ కావాలన్నా, కొత్త విషయం తెలుసుకునే యాప్ గురించి సెర్చ్ చేయాలంటే వెంటనే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు వెంటనే గూగుల్ ప్లే స్టోర్‌కు వెళతారు. అయితే ఇందులో ఎన్నో హానికరమైన యాప్స్ ఉన్నాయని తెలుసుకోండి. హ్యాకర్లు మీ డేటా కోసం ఉద్దేశపూర్వకంగానే కొన్ని వైరస్ ఫైల్స్ క్రియేట్ చేస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సైబర్ నేరాలకు అధిక శాతం కారణం యాప్స్ దుర్వినియోగం, ప్రమాదకర యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించడమేనని నిపుణులు హెచ్చరిస్తుంటారు. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరుగుతుండటంతో రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. కొన్ని యాప్స్ ద్వారా గూగుల్ సెక్యూరిటీని దాటుకుని మరీ సైబర్ నేరగాళ్లు మీ వ్యక్తిగత వివరాలను దోచేస్తారు. డాక్టర్ వెబ్ ప్రకారం 9 రకాల యాప్స్ యూజర్ల ఫేస్‌బుక్ (Facebook) సమచారాన్ని చోరీ చేస్తున్నాయని పేర్కొంది. ఆ హానికారక యాప్స్ ఇప్పటివరకూ 5.8 మిలియన్ల పర్యాయాలు డౌన్‌లోడ్ చేసుకుని ఆండ్రాయిడ్ యూజర్లు వినియోగించడం గమనార్హం. 


Also Read: Gold Price In Hyderabad: నేటి మార్కెట్‌లో నిలకడగా బంగారం ధరలు, పుంజుకున్న వెండి ధరలు


10 ట్రోజన్ యాప్స్ ఉన్నాయంటే అందులో 9 గూగుల్ ప్లే స్టోర్‌లోకి వస్తున్నాయని డాక్టర్ వెబ్ సైబర్ నిపుణులు (Malware Analysts) వెల్లడించారు. ఆ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటే మీ మొబైల్ డేటా, ఫేస్‌బుక్ డేటాను సైబర్ నేరగాళ్లు సేకరించి, బ్లాక్ మెయిల్ చేయడం, డబ్బులు గుంజడం లాంటివి జరుగుతాయని పేర్కొన్నారు. ఈ యాప్స్‌లో లాగిన్ కావాలంటే ఫేస్‌బుక్ క్రెడెన్షియల్స్ నమోదు చేయాలని అడుగుతాయి. అచ్చం ఫేస్‌బుక్ లాగిన్ పేజీ కనిపించడంతో యూజర్లు డేటాను ఎంటర్ చేయగానే సైబర్ నేరగాళ్లు మీకు తెలియకుండానే ఈ Android Apps ద్వారా మీ ఫేస్‌బుక్ వివరాలు సేకరిస్తారు. డాక్టర్ వెబ్ ప్రకారం కింద పేర్కొన్న యాప్స్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటే వాటిని తక్షణమే అన్ ఇన్‌స్టాల్ చేసుకుని మీ డేటాను కాపాడుకోండి.


Also Read: Samsung Galaxy F22 Price: జులై 6న విడుదలకు సిద్ధంగా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22, ఫీచర్లు ఇవే


ప్రాసెసింగ్ ఫొటో, పీఐపీ ఫొటో - ఇది ఫొటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ యాప్. ఇదివరకే 5 లక్షల పర్యాయలు ఇన్‌స్టాల్ అయింది. 


యాప్ కీప్ లాక్, యాప్ లాక్ మేనేజర్, లాక్‌కిట్ మాస్టర్ - మీ స్మార్ట్‌ఫోన్‌ను యాప్ ద్వారా లాక్ చేసుకోవచ్చు. మొత్తంగా ఈ యాప్స్ 65వేల పర్యాయాలు ఇన్‌స్టాలు చేసుకున్నారు. ఈ యాప్ కూడా మీ ఫేస్‌బుక్, ఇతర వ్యక్తిగత డేటాను చోరీ చేస్తుంది.


హోరోస్కోప్ డైలీ, హోరోస్కోప్ పై -  జాతకాలు, రాశిఫలాలు కోసం వినియోగించే ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. Android.PWS.Facebook.13లో ఈ యాప్స్ ఇన్‌స్టాల్స్ జరుగుతున్నాయని గుర్తించారు. లక్షకు పైగా డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ అయ్యాయని, వాటిని సాధ్యమైనంత త్వరగా అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవాలి.


Also Read: LPG Cylinder Price: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు, ఆయా నగరాలలో లేటెస్ట్ ధరలు ఇలా


ఇన్‌వెల్ ఫిట్‌నెస్
ఫిట్‌నెస్ యాప్‌లకు కరోనా వ్యాప్తి సమయం నుంచి డిమాండ్ పెరిగింది. ఇన్‌వెల్ ఫిట్‌నెస్ యాప్‌ను ర్యుబెన్ జెరమైన్ డెవలప్ చేయగా, ఇదివరకే 1,00,000 పర్యాయాలు డౌన్‌లోన్ జరిగినట్లు వెల్లడించింది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook