Bicycle owner gets Rs 1.51 lakh road tax notice, know the full details here : సాధారణంగా బైక్స్, లేదంటే ఫోర్ వీలర్స్‌పై చలనాలు, రోడ్ ట్యాక్స్ పడుతుంటాయి. అయితే ఒక సైకిల్‌పై ఇలాంటి చలానా విధించారు అధికారులు. యూపీలో ఒక సైకిల్‌పై రూ. 1.51 లక్షల చలానా పడింది. సైకిల్‌పై ఇంత పెద్ద మొత్తంలో రోడ్డు ట్యాక్స్ పడడంతో ఆ సైకిల్ యజమాని షాక్‌ అయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా నగరంలోని దిబియాపూర్ మున్సిపాలిటీలో (Dibiyapur municipality) ఈ ఘటన చోటు చేసుకుంది. అసిస్టెంట్ రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (ARTO) (Assistant Regional Transport Officer) నుంచి రూ. 1,51,140 రోడ్డు ట్యాక్స్ ( road tax) చెల్లించాలంటూ నోటీసు అందుకున్నాడు సైకిల్ యజమాని. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దిబియాపూర్ సమీపంలోని సెహుద్ గ్రామానికి చెందిన సురేష్ చంద్రకు ఒక సైకిల్ ఉంది. అయితే ఈయనకు జూన్ 2014‌‌ నుంచి సెప్టెంబర్ 2021 వరకు సంబంధించి మోటారు వాహనాల పన్నుగా రూ. 1.5 లక్షలు చెల్లించాలంటూ నోటీసులు వచ్చాయి.


సెప్టెంబరు 16న ఆర్టీఓ జారీ చేసిన ఈ నోటిస్ ఆయనకు మూడు రోజుల క్రితం అందింది. అయితే ఆ నోటీస్‌ సురేష్ చంద్ర 16 ఏళ్ల కొడుకు సుధీర్ పేరిట జారీ అయ్యింది. ధర్మశాలలో సెక్యూరిటీ గార్డుగా పని చేసే సురేష్ చంద్రకు ఒక సైకిల్ ఉంది. ఆయన కొడుకుకు అసలు సైకిలే లేదు. ఇక నోటీసులో వాహనం ఫిట్‌నెస్‌లకు సంబంధించిన నోట్ కూడా ఉంది. మొత్తానికి ఈ నోటిస్‌ చూసిన సురేష్ చంద్ర షాక్ అయ్యాడు. తనకు ఉన్నది కేవలం ఒక సైకిలే అని ఎలాంటి వాహనం తన పేరు మీదగానీ.. తన కొడుకు పేరు మీద గానీ లేదని పేర్కొన్నాడు. 


Also Read : EPFO Portal Down: మొరాయిస్తోన్న ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌.. నామినేషన్ దాఖలుకు మూడు రోజులే సమయం


ఇక ఈ విషయంపై ARTO అధికారి అశోక్ కుమార్ దృష్టికి వెళ్లింది. ఆ నోటిస్ పొరపాటున జారీ ఉండవచ్చని చెప్పారు. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టి.. ఇలా తప్పుడు నోటీసు పంపడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.


Also Read : Sunny Leone Song: ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న 'అరెస్ట్ సన్నీలియోన్' హ్యాష్ టాగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి