Big python pulling out the swallowed snake completely video goes viral: చాలా మంది పాములంటే చచ్చేంత భయపడిపోతుంటారు. పాములు కన్పిస్తే ఆ ప్రదేశాలకు అస్సలు వెళ్లరు. ముఖ్యంగా వర్షాకాలంలో పాములు ఎక్కువగా మన ఇళ్లలోనికి వస్తుంటాయి. వర్షం నీళ్లు, చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాలు, ఎలుకలు ఉన్న చోట్ల పాములు కన్పిస్తుంటాయి. పోలాలు, కొండలు ఉన్న ప్రాంతాలలో కూడా పాములు ఎక్కువగా నే ఉంటాయి.కొందరు పాములు కన్పిస్తే వెంటనే  భయపడిపోతారు. పాములు పట్టే వారికి సమాచారం ఇస్తారు. కానీ మరికొందరు మాత్రం పాముల్ని చంపడానికి ప్రయత్నిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



పెద్దలు, పండితులు పాముల్న చంపొద్దంటారు. దీని వల్ల  కాలసర్ప దోషం కల్గుతుందని చెపుతుంటారు. ఈదోషం వల్ల జీవితంలో అనేక ఇబ్బందులు కల్గుతాయి. పెళ్లి కాదు, జాబ్ లో ప్రమోషన్ కూడా కష్టంఅవుతుందని చెబుతుంటారు. అందుకే చాలా మంది పాముల్ని చంపరు. ఇదిలా ఉండగా పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. కొన్ని షాకింగ్ కు గురిచేసేవిలా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేసేవిగాను ఉంటాయి. నెటిజన్లు సైతం వీటిని చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు..


కొన్నిసార్లు పాములు చిన్న పాముల్ని మింగేస్తుంటాయి. కొండ చిలువలు సైతం తమకన్నా.. చిన్నగా ఉండే పాములు కొండ చిలువను తరచుగా మింగేస్తుంటాయి. ఇలాంటి ఘటనలు తరచుగా వార్తలలో ఉంటాయి. అడవుల్లో భారీ సర్పాలు, ఇతర జీవుల్ని వేటాడుతుంటాయి. అడవులు, కొండ ప్రాంతాలలోసైతం గిరినాగులు, కొండ చిలువలు, కోబ్రాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తమకన్నా.. చిన్నగా ఉండే పాములను మింగేస్తుంటాయి.


ఇదిలా ఉండగా.. ఇక్కడ ఒక భారీ కొండ చిలువ, పెద్ద పామును అమాంతం మింగేసింది. ఆతర్వాత అది ఆయాసంలో అది ఇబ్బందులు పడింది. ఆ తర్వాత అది తన నోటిలో నుంచి పామును బైటకు మింగేసింది. ఈ ఘటనను చుట్టుపక్కల వారు షాకింగ్ తో చూస్తు ఉండిపోయారు. కొండ చిలువ ముందుకు వెనక్కు కదులుతూ.. పామును బైటకు వదిలేసింది. అప్పటికే ఆ పాము పూర్తిగా చచ్చిపోయింది.  దీన్ని అక్కడున్న వారు షాకింగ్ తో చూస్తు ఉండిపోయారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. ఇదేం కొండ చిలువ భయ్యా.. అంటూ నెటిజన్లు షాక్ కు గురౌతున్నారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి