Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..
Bihar Girl reels in Rain: బీహర్ లో యువతి వర్షం కురుస్తుండటంతో ఏదైన వెరైటీగా చేయాలనుకుంది. వెంటనే టెర్రాస్ మీదకు ఎక్కేసింది. వర్షంలో తడుస్తూ తన ఫోన్ లో రీల్స్ రికార్డు చేసుకుంటుంది. ఇంతలో ఊహించని ఘటన చోటు చేసుకుంది.
Bihar Girl Escapes lightning strike while reels: కొంత మంది యువత ఇటీవల ఓవర్ నైట్ లో ఫెమస్ అయిపోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇక సోషల్ మీడియా పుణ్యామా.. అని తమ టాలెంట్ అంతా అందులో చూపిస్తున్నారు. కొందరు డ్యాన్స్ లు, రీల్స్, తమ వెర్రి పనులు చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ వీడియోలలో కొన్నిషాకింగ్ కు గురిచేసేవిగా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యానికి లోనయ్యేవిగాను ఉంటున్నాయి. అదే విధంగా..ఈ మధ్యకాలంలో యువత రీల్స్ పిచ్చిలో పడి తమ ప్రాణాలు సైతం డెంజర్ లో పడేసుకుంటున్నారు. ఇప్పటికే కదులుతున్న రైలుకి దగ్గరగా వెళ్లి రీల్స్, మెట్రోలో, జలపాతాలు,అడవుల్లో రీల్స్ చేస్తు తమ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు మరికొందరు క్రూర జంతువుల దగ్గరు వెళ్లి రీల్స్ కోసం ప్రయత్నించి, వాటి దాడివల్ల గాయాలపాలౌతున్నారు. మరికొందరైతే.. బైక్ ల మీద, కార్ల మీద వెరైటీ స్టంట్ లు చేస్తున్నారు.
ఈ క్రమంలో.. ఎలాగైన ఫెమస్ అయిపోవాలని ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు ఈ రీల్స్ విషయంలో ఏమాత్రం తీసిపోని విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నార్మల్ గా వర్షంపడుతుందంటే ప్రతి ఒక్కరు సంబర పడుతుంటారు.తొలకరి వర్షంలో తడవాలనుకుంటారు. కానీ వర్షం పడుతున్నప్పుడు.. బైటకు వెళ్లొద్దని పెద్దవాళ్లు చెప్తుంటారు. కొన్నిసార్లు మెరుపుతో పాటు, ఉరుములు కూడా పడుతుంటాయి. అయితే.. ఇక్కడ ఒక యువతి వర్షం పడుతుండగా, వర్షంలో రీల్స్ చేయాలని అనుకుంది. వెంటనే టెర్రాస్ మీదకు ఎక్కేసింది. అప్పుడు ఆమెను నేచర్ భయపెట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
బీహర్ లోని సీతామఢీ (డీ) లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఒక యువతి.. వర్షం పడుతుండటంతో వెంటనే ఏదైన వెరైటీగా చేయాలనుకుంది. ఈ క్రమంలో టెర్రాస్ మీదకు ఎక్కేసింది. దూరంలో తన ఫోన్ పెట్టేసి రికార్డు ఆప్షన్ ప్రెస్ చేసింది. ఇక వర్షంలో తడుస్తూ.. మైమరిచిపోయి మాంచి స్టెప్పులు వేస్తుంది. ఇంతలో ఆమె టాలెంట్ చూసి ప్రకృతి కుళ్లుకుందో లేదా తనకు ఇంత టాలెంట్ ఎందుకు లేదాఅని అనుకుందో కానీ.. ఒక్క సారిగా యుతికి షాక్ ఇచ్చింది.
Read more: Heart stroke: విధుల్లో ఉండగా గుండెపోటు.. కుప్పకూలీన 30 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి.. వీడియో వైరల్..
యువతి రీల్స్ చేస్తున్న అడుగుల దూరంలో ఒక్కసారిగా పిడుగు పడింది. వెంటనే ఆ శబ్దానికి యువతి బాప్ రే.. అంటూ వెంటనే ఇంట్లోకి పారిపోయింది. ఈ ఘటన మాత్రం ఆ యువతి ఫోన్ లో రికార్డు అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వెంట్రుక వాసిలో తప్పించుకుంది.. అంతే ఈమె టాలెంట్ చూసి.. ప్రకృతి తట్టుకోలేకపోయిందంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి