Nurse Beats Two Boys For Making Video Of hospital poor management: ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులపై వీడియో తీసిన ఇద్దరు యువకులను గదిలోకి లాక్కెళ్లి మరీ కర్రలతో తీవ్రంగా కొట్టారు ఆస్పత్రి నర్సులు. దెబ్బలు తాళలేక ఓ యువకుడు బోరున ఏడ్చేశాడు. కొట్టొద్దని ప్రాధేయపడ్డప్పటికీ.. నర్సు ఏమాత్రం కనికరించలేదు. ఈ సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నివేదికల ప్రకారం... బిహార్‌లోని సరన్‌ జిల్లా ఛప్రా ఆసుపత్రికి మెడికల్‌ సర్టిఫికెట్‌ కోసం ఇద్దరు యువకులు వెళ్లారు. అయితే ఆసుపత్రిలో నెలకొన్న అసమర్థత పరిస్థితులపై తమ ఫోన్లలో వీడియో తీశారు. ఇది గమనించిన ఇద్దరు నర్సులు.. వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆసుపత్రి సిబ్బంది వచ్చి ఇద్దరు యువకులను ఓ గదిలో బంధించారు. ఏం వీడియో తీశారని, వీడియో డిలీట్ చేయాలని నర్సులు వారిని బెదిరించారు. 


వీడియో డిలీట్ చేయకపోవడంతో యువకులను కర్రలతో కొట్టారు. ఓ యువకుడిని అయితే మరీ దారుణంగా బాదింది ఓ నర్సు. దెబ్బలు తాళలేక అతడు బోరున ఏడ్చేశాడు. కొట్టొద్దని ప్రాధేయపడ్డప్పటికీ.. నర్సు ఇంకా ఎక్కువగా బాదింది. దాంతో యువకుడు కిందపడిపోయాడు. యువకులను ఇద్దరు నర్సులు 4 గంటల పాటు చావబాదారట. నర్సుల పేర్లు పూజ, సాక్షిగా సమాచారం తెలుస్తోంది. 



ఇందుకు సంబంధించిన వీడియోను 'Saurabh Bahuguna46' అనే ట్విట్టర్ యూసర్ పోస్ట్ చేశాడు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీహార్ పోలీస్, బిహార్‌ ఆరోగ్య శాఖకు వీడియోను ట్యాగ్‌ చేశారు. ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు కాలేదని బీహార్ సీఎం నితీష్ కుమార్ ను కూడా ట్యాగ్ చేసారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. 


Also Read: తగ్గిన బంగారం ధర.. ఏకంగా రూ. 3900 తగ్గిన వెండి! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే


Aslo Read: T20 World Cup 2022: పాకిస్తాన్‌ను ఓడిస్తే.. భారత్‌దే టీ20 ప్రపంచకప్‌: సురేశ్‌ రైనా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook