Bike Stunt Viral Video: భారత్‌లో ప్రతి సంవత్సరానికి 5 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో ఎక్కువగా రోడ్డు భద్రతా నియమాలు పాటింకపోవడం వల్లే జరుగుతున్నాయని అధికారులు తెలుపుతున్నారు. ద్విచక్రవాహనదారులు తరచుగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి నడపడం వల్ల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. అయితే ఇటీవలే ట్రాఫిక్‌ నింబంధనలను ఉల్లంఘించి ఒకే స్కూటర్‌పై ఆరుగురు వ్యక్తులు కూర్చుని ప్రయానిస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఈ వీడియోలో  బైక్ సీటుపై ఐదుగురు అబ్బాయిలు ఉండగా..మరో వ్యక్తి ఓ వ్యక్తి భుజంపై కూర్చున్నాడు. వారెవరూ హెల్మెట్ కూడా ధరించలేరు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 




ఓ వ్యక్తి ఇలా ట్వీట్‌ చేశాడు:


రమణదీప్ సింగ్ హోరా అనే వ్యక్తి ఈ దృశ్యాలను ట్వీటర్‌ ఖాతా ద్వారా ముంబై పోలీస్, పోలీస్ కమిషనర్‌ను ట్యాగ్ చేశారు. దీని ఇలా కాప్షన్‌ పెట్టారు.."ట్రాఫిక్‌ నింబంధనలను ఉల్లంఘించి ఒకే స్కూటర్‌పై ఆరుగురు వ్యక్తులు కూర్చున్నారు." అని రాసుకొచ్చారు. దీని పై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. దయచేసి ఇలా ఎవరు చేయకూడదని ఆయన ఆకాంక్షించారు.



స్కూటీపై 6 మంది కూర్చొని స్టంట్స్‌:


ఈ వీడియోపై ముంబై ట్రాఫిక్ పోలీసులు స్పందిస్తూ..ఆ బైక్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్నారు. అంతే కాకుండా ఆ సంఘలన ఏ ప్రదేశంలో జరిగిందో..రమణదీప్ సింగ్ హోరను అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ వీడియోను పెట్టిన కొంత సమయంలోనే  55,000 మంది దీనిని చూడడం విశేషం.



నెటిజన్లు ఇలా స్పందిస్తున్నారు:


ఈ వీడియోను చూసిన వినియోగదారులు ఇలా స్పందిస్తున్నారు..'కొంతమంది వ్యక్తులు చట్టం, నియమాలు, నింబంధనలు పాటించకుండా ఇలాంటి స్టంట్స్‌కి పాల్పడుతున్నారని.. లాంటి పరిస్థితుల్లో తమ ప్రాణాలకే కాదు, ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు.. 'నిజంగా ఇలా చేయడం చాలా తప్పు. నంబర్ ప్లేట్ కనిపింస్తే పోలీసులు సులభంగా గుర్తుపడతాయని చట్టాన్ని ఉల్లంఘించి నంబర్‌ ప్లేట్ కనబడకుండా దాచారు' ఇలా చేయడం చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు.


Also Read: Viral Video: కొన్నది సెకండ్ హ్యాండ్ సైకిలే కానీ.. బెంజ్ కారు కొన్న రేంజ్‌లో సంతోషం! కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో


Also Read: Viral Video: వాటర్‌ డ్యామ్‌ వద్ద అపశృతి..పాకుతూ జారిపడ్డ వ్యక్తి..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి