Black King Cobra Viral Video: పాములంటే భయపడేవారు చాలా మంది ఉన్నారు. కొందరైతే పాము ఎదురైతే చాలు ఆమడ దూరం పరిగేత్తే వారుంటారు. కానీ మనుషులకు అన్ని పామలు హాని కలిగించవు. ప్రపంపచంలో జీవించే వంద శాతంలో పాముల్లో 80 శాతం పాములు విషపూరితమైతే 20 శాతం పాములు ఎలాంటి హాని కలిగించనవి. అయితే ఇంటర్నేట్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా వీడియోల్లో పాములకు సంబంధించినవే అధికంగా ఉంటున్నాయి.  వీటిల్లో చాలా వరకు నెటిజన్లను భయం పుట్టించే విధంగానే ఉంటున్నాయి. అయితే ఇటీవలే ఆడవి ప్రాంతాల్లో నుంచి మనుషులు సంచారం చేసే ప్రదేశాల్లో పాములు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఈ రోజు వైరల్‌ అవుతున్న వీడియో కూడా అలాంటిదే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం చాలా పాములు ఆడవిలో ఎలాంటి ఆహారాలు లభించ జనాలున్న ప్రాంతాలకు విచ్చల విడిగా వస్తున్నాయి. అయితే ఈ రోజు వైరల్‌ అవుతున్న వీడియోలో కూడా అలాగే జరిగింది. ఓ బ్లాక్‌ కింగ్‌ కోబ్రా జనాలు కలిగిన ఓ హోటల్‌లోకి దూరింది. దీంతో ఆ హోటల్‌ యజమాని విషయాన్ని తెలుసుకుని సమాచారాన్ని స్నేక్‌ క్యాచర్స్‌కు అందిస్తారు. దీంతో వారు ఆ ప్రదేశానికి చేరుకుంటారు. అయితే పాములు చీకటి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో దూరేందుకు ఎక్కువగా ఇష్టపడతాయి. అయితే ఈ పాము కూడా ఎక్కువగా చికటిగా ఉన్న ప్రదేశంలో దూరింది. దీంతో వారు ఆ ప్రదేశాన్ని గుర్తు పట్టి.. ఆ భయం కరమైన కింగ్‌ కోబ్రాను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ స్నేక్‌ క్యాచర్స్‌కు ఆ పాము దొరకదు.



స్నేక్‌ క్యాచర్స్‌ ఆ పామును పట్టుకునేందుకు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. అయితే 5 నిమిషాల తర్వాత ఆ పాము స్నేక్‌ క్యాచర్‌కు పట్టుబడుతుంది. దీంతో వారు పామును పట్టుకుని ఓ సంచిలో బంధిస్తారు. ఆ తర్వాత పామును ఓ ఆటవి ప్రాంతానికి తీసికెళ్లి అక్కడ వదిలేస్తారు. ఇలా స్నేక్‌ క్యాచర్స్‌ పాములను రక్షించేందుకు వారి వంతుగా ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇంకొందరు స్నేక్‌ క్యాచర్స్‌ పామును పట్టుకునే క్రమంలో కాటుకు గురై మరణిస్తున్నారు.


ఈ వీడియోను ప్రముఖ స్నేక్‌ క్యాచర్‌  యూట్యుబ్‌ చానెల్‌ Nick Wildlifeలో పోస్ట్‌ చేశారు. అయితే దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతేకాకుండా స్నేక్‌ క్యాచర్స్‌ చేసిన పనికి సలామ్‌ కూడా కొడుతున్నారు. అయితే ఈ వీడియోను ఇప్పటివరుకు 15 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. అంతేకాకుండా చాలా మంది లైక్‌ కూడా చేశారు. ఈ వీడియోను మూడు నెలల క్రితమే పోస్ట్‌ చేయగా ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారడం విశేషం.


ఇది కూడా చదవండి : Realme Smartphone: రూ. 17 వేల ఫోన్ కేవలం రూ. 1149 కే.. సూపర్ డీల్ కదా..


ఇది కూడా చదవండి : Cheap and Best Car: తక్కువ ధరలో ఎక్కువ సేఫ్టీని ఇచ్చే బెస్ట్ కారు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook