18 Feet Black King Cobra scared 3 Snake Catchers: ‘పాము’ అనే పదం వింటేనే చాలా మంది వణికిపోతారు. అది 'కింగ్ కోబ్రా' అయితే ఇంకేమైనా ఉందా.. భయంతో వణికిపోతారు. అత్యంత ప్రమాదకరమైన జంతువులు కూడా కింగ్ కోబ్రాలకు ఆమడ దూరంగా ఉంటాయి. ఎందుకంటే అత్యంత విషపూరిత పాము కింగ్ కోబ్రానే. ఈ పాము కాటుకు బలమైన ఏనుగు కూడా మరణిస్తుంది. సాధారణంగా అటవి ప్రాంతాలలో సంచరించే కింగ్ కోబ్రా చాలా సిగ్గరి. ఎవరి కంట దాదాపుగా పడవు. అయితే కింగ్ కోబ్రాను రెచ్చగొడితే మాత్రం చాలా ప్రమాదకరంగా మారుతుంది. మూడో వంతు పడగెత్తి కాటేయడానికి మీదికి దూసుకొస్తుంది. ఒక్కోసారి స్నేక్ క్యాచర్‌లకు ఉచ్చ పోయిస్తుంది. అలాంటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... ముగ్గురు స్నేక్ క్యాచర్‌లు పొలాల మధ్యలో సంచరిస్తూ కింగ్ కోబ్రా ఉండే బొరియను కనుగొంటారు. ముగ్గురు కలిసి ఆ బొరియను తొవ్వుతుండగా.. చిన్నపాటి రంద్రం కనిపిస్తుంది. కచ్చితంగా ఇందులో కింగ్ కోబ్రా ఉంటుందని నమ్మిన వారు బొరియను మరింత తవ్వుతారు. వారికి అందులో ఓ 15 అడుగుల బ్లాక్ కింగ్ కోబ్రా కనిపిస్తుంది. స్టిక్ సాయంతో దాన్ని బయటికి తీయగా.. అది కాటేయడానికి మీదికి దూసుకొస్తుంది. ముగ్గురు స్నేక్ క్యాచర్‌లు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. బొరియలో మరో పెద్ద బ్లాక్ కింగ్ కోబ్రా బయటికి వస్తుంది. 


రెండో బ్లాక్ కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు ఇద్దరు స్నేక్ క్యాచర్‌లు రాగా.. అది కోపంతో కాటేయడానికి మీదికి దూసుకొస్తుంది. తృటిలో వారు తప్పించుకుంటారు. అయినా కూడా అది ఆగదు. తోకను పట్టుకోవడానికి వస్తుండగా భారీ ఎత్తున పడగెత్తి దూసుకొస్తుంది. దాంతో ఇద్దరు స్నేక్ క్యాచర్‌లు భయంతో పారిపోతారు. మరో స్నేక్ క్యాచర్‌ మాత్రం చాలా దైర్యం చేసి దాన్ని పట్టుకునేందుకు వస్తాడు. చివరకు రెండో బ్లాక్ కింగ్ కోబ్రాను అదుపు చేస్తాడు. లేడీ స్నేక్ క్యాచర్‌ వచ్చి సంచి దాని తలపై వేసి బంధిస్తుంది. ఆపై మరో పామును కూడా అలానే బంధిస్తుంది. 



ముగ్గురు స్నేక్ క్యాచర్‌లకు ఉచ్చ పోయించిన బ్లాక్ కింగ్ కోబ్రాకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను 'Giant King Cobra' అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. నాలుగు నెలల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకి 8,381 వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ముగ్గురు స్నేక్ క్యాచర్‌లకు ఉచ్చ పోయించిందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


Also Read: Best Runner: వికెట్ల మధ్య వేగంగా ఎవరు పరుగెత్తుతారు.. ఎంఎస్ ధోనీని ఎంచుకోని విరాట్ కోహ్లీ! ఊచించని సమాధానం  


Also Read: Ugadi 2023: ఉగాది రోజు ఈ వస్తువును ఇంటికి తీసుకెళ్లండి.. ఏడాదంతా డబ్బేడబ్బు! మంచి ఆరోగ్యం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి