పురిటి నొప్పులకు తట్టుకునే వినూత్న వైద్యం
పురిటి నొప్పులంటే సహజంగా ఏ స్త్రీకైనా ఇబ్బందికర విషయం.. అలాంటి నొప్పులను తట్టుకునే చిట్కా ఉందట.. ఆర్టికల్ చదవండి మీకే అర్థమౌతుంది.
అవును... ఇదీ మేము చెబుతుంది కాదు. బ్రెజిల్ కు చెందిన ప్రముఖ వైద్యుడి సలహా. స్త్రీలకు గర్భస్త సమయం ఎంతో కీలకమైంది. పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటే... తప్పకుండా పురిటినొప్పులను పెదవి బిగిట భరించాల్సిందే. అలా తీవ్రమైన శారీరక వేదనకు పరిష్కారం చూపేలా ఈ బ్రెజిల్ వైద్యుడు ఫెర్నాండో సరికొత్త విధానాన్ని అమలుపరుస్తున్నారు. ఆధునిక విధానాన్ని గర్భిణీలతో అమలు చేస్తున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. తన ఆసుపత్రికి వచ్చిన స్త్రీలతో కలిసి డ్యాన్స్ చేయించడమే... వైద్యుడు రూపొందించిన నూతన విధానం.
అయితే ఈ విధానంలో శారీరక ఉల్లాసంతోపాటు, స్త్రీలకు ప్రసవ వేదన చాలా వరకు తగ్గుతుంది. కడుపులోని బిడ్డపై ఒత్తిడి పెరిగి ప్రసవం సులభంగా అవుతుంది. దీనికోసం చిన్న చిన్న స్టెప్పులు వేస్తూ... స్త్రీలు నెమ్మదిగా డ్యాన్స్ చేయడమేనని డాక్టర్ ఫెర్నాండో చెబుతున్నారు. ఆసుపత్రిలోని ఓ సిబ్బంది ఈ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది.