Bride Drives Bullet: ఒకప్పుడు పెళ్లి అంటే.. అమ్మాయిలు సిగ్గుతో తల ఎత్తుకునే వాళ్లే కాదు అనే మాట తరచూ వింటూనే ఉంటాం. నిజంగానే పెళ్లిళ్లు ఒకప్పుడు అలాంటి (Old Wedding Style) పద్ధతుల్లో జరిగేవి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మారుతున్న కాలంతో పాటు పెళ్లిళ్ల విషయంలోను అనేక మార్పులు వచ్చాయి.


ముఖ్యంగా పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్​ జరుపుకోవడం.. అనేది కొత్త సంప్రదాయంగా (New Wedding Trends) మారింది. పెళ్లి చేసుకునే జంటకు అది ఓ అందమైన అనుభూతిగా మిగిలిపోతుందని చాలా మంది ఇలాంటి కొత్త సంప్రదాయాలపై మక్కువ పెంచుకుంటున్నారు.


ఇలాంటి సంప్రదయాలకు సంబంధించి చేసే కొన్ని చిలిపి పనులు ఇంటర్నెట్​లో వైరల్​గా మారుతుంటాయి. అలాంటిదే ఓ కొత్త వీడియో (Viral Wedding videos) వచ్చింది.


పెళ్లికూతురుగా రెడీ అయ్యాక మేకప్​ పోతుందని.. ఇంకా వేర్వేరు కారణాలతో అడుగు తీసి అడుగు పెట్టాలన్నా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ ఓ యువతి మాత్రం అందుకు విరుద్ధంగా పెళ్లి కూతురు గెటప్​లో.. ఏకంగా బుల్లెట్​ బైక్​తో రోడ్డుపై చక్కర్లు (Bride on Bullet bike) కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.


ఎరుపు రంగు లెహంగా, నగలు ధరించిన ఆ యువతి అలా రోడ్డుపై  బైక్​ నడుపుతూ వెళ్తుండటం చూసి.. చుట్టుపక్కల వాళ్లంతా ఆశ్యర్యపోయారు. నెటిజన్లు మాత్రం పెళ్లి కూతురు గెటప్​లో బుల్లెట్​ నడపడం చూసి.. ఆ యువతిపై ప్రశంసలు (Viral wedding video) కురిపిస్తున్నారు.


witty_wedding అనే ఇన్​స్టాగ్రామ్​ పేజీ ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోకు.. 'మీ లవ్ మ్యారేజ్​కు ఇంట్లో అందరూ ఒప్పుకున్నప్పుడు..' అనే ట్యాగ్​లైతో ఈ వీడియోను షేర్ చేసింది. అయితే ఈ వీడియో ఎక్కడ జరిగింది అనే విషయంపై ఆధారాలు లభించలేదు.



నాని హీరోగా వచ్చిన మజ్ను సినిమా క్లైమ్యాక్స్ సీన్​లో కూడా హీరోయిన్ అనూ ఇమాన్యుయల్ ఇలా పెళ్లి కూతురు గెటప్​లో బుల్లెట్ నడుపుతుంది. అయితే రియల్​ లైఫ్​లో కూడా అలాంటి సీన్ జరగటం విశేషం.


Also read: Viral Video : చెప్పులు చేతపట్టి.. నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్న వీడియో


Also read: ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇండియన్ బిజినెస్ టైకూన్ ఎవరో గుర్తుపట్టగలరా...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook