Bride struggled a lot to garland Tall Groom: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు సందడి చేస్తుంటాయి. ముఖ్యంగా మనుషులు, జంతువులకు సంబందించిన కొన్ని వీడియోలు జనాలకు నచ్చడంతో అవి విపరీతంగా వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు ఆశ్చర్యపరిస్తే, మరికొన్ని అందరికీ షాక్ ఇస్తుంటాయి. ఇంకొన్ని మాత్రం విపరీతమైన నవ్వును తెప్పిస్తాయి. ఇలాంటి వీడియోనే ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో పొడవాటి వరుడికి పూలదండ వేసేందుకు వధువు తెగ కష్టపడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పొడవాటి వరుడు ఊరేగింపుతో కల్యాణ మండపానికి చేరుకుంటాడు. కొంత సమయం తరువాత వధువు కూడా వస్తుంది. జయమాల సమయం రానే వచ్చింది. అయితే వధువు కంటే వరుడు చాలా పొడవుగా ఉంటాడు. దాంతో వధువు అతనికి పూలమాల వేసేందుకు చాలా కష్టపడుతుంది. చేతిలో పూలదండ పట్టుకుని ఎగిరి మరీ వరుడు మెడలో దండ వేసే ప్రయత్నం చేస్తుంది. ఎట్టకేలకు పెళ్లి కూతురు ఎన్నో ప్రయత్నాలు చేసి వరుడి మెడలో దండ వేస్తుంది. ఈ అపూర్వ దృశ్యాన్ని చూసి కళ్యాణ మండపంలోని అందరూ తెగ నవ్వుకున్నారు. 



ఆపై వధువు మేడలో వరుడు సునాయాసంగా దండ వేస్తాడు. జయమాల జరగ్గానే అందరూ చప్పట్లు కొడుతారు. ఇందుకు  సంబంధించిన ఈ వీడియోను ravikany87 పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. పాపం వధువు, వధువుకు ఎన్ని కష్టాలో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


Also Read: ఏడాదిలోనే బ్రేకప్‌ చెప్పేసిన హీరోయిన్.. మూన్నాళ్ల ముచ్చటే అయిందిగా!


Also Read: MS Dhoni: టైమ్ లేదంటూ.. రోహిత్ శర్మ కాల్ కట్ చేసిన ఎంఎస్ ధోనీ (వీడియో)!


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook