Bride Groom Videos: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ అందులో కొన్ని వీడియోలు మాత్రమే మళ్ళీ మళ్లీ చూడాలి అని అనిపించేలా ఉంటాయి. మిగతావి నెటిజెన్స్ ని అంతగా ఆకట్టుకోవు. ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వధూవరుల వీడియో కూడా అలా మొదటి రకానికి చెందిన ఆకట్టుకునే వీడియోనే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక పెళ్లి వేడుకలో చోటుచేసుకున్న ఒక దృశ్యం నెటిజెన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. పెళ్లి వేడుకలో పెళ్లి తంతు దాదాపు పూర్తి కావచ్చింది. ఫోటో సెషన్ జరుగుతోంది. పెళ్లికి వచ్చిన అతిధులు కొత్త జంటను కలిసి, ఆశీర్వదించి వెళ్తున్నారు. ఇంతలోనే ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక మాయదారి దోమ సడెన్ గా వచ్చి వరుడి కంట్లో పడింది. అనుకోని పరిణామానికి వరుడు విలవిలలాడిపోయాడు. కంట్లో దోమ పడిన బాధతో వరుడు ఇబ్బంది పడటం చూసిన నవ వధువు అతడి బాధను చూసి తట్టుకోలేకపోయింది. ఆమె కూడా ఆ దోమ తన కంట్లోనే పడినంతగా ఆందోళనకు గురైంది. ఆ బాధతోనే వరుడి కంట్లో పడిన దోమని తీసేందుకు స్వయంగా తనే రంగంలోకి దిగింది.  


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో ఇదే..




తన భర్తకు కలిగిన అవస్థను చూసి తట్టుకోలేకపోయిన ఆ వధువు.. తనే అతడి కంట్లోపడిన దోమను వెలికితీసింది. అతడికి నొప్పి నుంచి ఎంతో కొంత ఊరట కలిగించేందుకు తన వంతు ప్రయత్నాలు తను చేసింది. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. అది చూసిన నెటిజెన్స్ తమ అభిప్రాయాలను వీడియో కింద కామెంట్స్ రూపంలో పంచుకుంటున్నారు. 


 


తనకు కూడా ఇలాంటి అందమైన మనసున్న యువతి భార్యగా వస్తే బాగుంటుంది అని పెళ్లి కాని ప్రసాదులు కామెంట్ చేస్తుండగా.. పెళ్లి అయిన వారేమో.. తన భార్య కూడా అలా ఉంటే బాగుంటుంది అని పరోక్షంగా తన భార్య అలా లేదని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ bhutni_ke_memes అనే హ్యాండిల్ ద్వారా పోస్ట్ అయిన ఈ వీడియోకు భారీ స్పందన కనిపిస్తోంది.