Viral video: ఏ జీవులైనా తమకు హాని చేయనంత వరకు ఎదురుదాడికి దిగవు అనేది పెద్దలు చెప్పే మాట. ముఖ్యంగా పాముల వంటి వాటిని కొట్టేందుకు వెళ్తేనున్నప్పుడు వాటి మానాన అవే పోతాయి.. వదిలేయండి అని చేబుతుంటారు. చాలాసార్లు అది నిజమవుతుంది కూడా. వాటికి ప్రమాదం ఉందని అనిపించిన, వాటిపై దాడికి దిగినా జంతువులు ఎదురుదాడి చేస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ మాటలు నిజమని నిరూపించే సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. అలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.


వీడియోలో ఏముంది?


ఓ కాలనీలో రోడ్డుపక్కల ఎద్దు నిలబడి ఉంది. అది ఎటూ వెళ్లకుండా చాలా సేపు అక్కడే నిలబడింది. అయితే అదే రోడ్డు అటుగా వెళ్తున్న ఓ పెద్దాయన.. దానిని అక్కడి నుంచి తరిమికొట్టేందుకు తన చేతిలో ఉన్న కర్రతో దాడి చేశాడు. ఆ పెద్దాయ దాడికి ప్రతిఘటించింది ఆ ఎద్దు. కొమ్ములతో పైకెత్తి విసిరింది. ఈ దృష్యాలన్ని స్థానికంగా ఉన్న ఓ సిసీ కెమెరాలో రికార్డయ్యాయి.


అయితే ఎద్దు దాడిలో ఆ పెద్దాయను.. అంతగా గాయాలు కాలేదు. ఆ ఎద్దు మాత్రం అక్కడినుంచి పారిపోయింది.



ఈ వీడియోను ఐఎఫ్​ఎస్​ అధికారి సుశాంత నంద షేర్ చేశారు. దీనికి ఇన్​స్టంట్​ కర్మ అనే క్యాప్షన్​తో షేర్ చేశారు. 25 వేల మందికి పైగా ఈ వీడియోను చూశారు. దీనిపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరేమో ఆ ఎద్దు ఆ పెద్దాయనదేనని.. అందుకే దానిని తిరిగి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. ఎక్కుమంది ఆ ముగ జీవిని కొట్టడం తప్పని అభిప్రాయపడుతున్నారు.


Also read: Snakes Viral Video: మూడు పాములను ఒకేసారి ఆడించబోయాడు.. పడగవిప్పిన పాము ఏం చేసిందో చూడండి


Also read: Doctor Suicide: వరకట్న వేధింపులు తాళలేక వైద్యురాలు మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook