Viral Video: బస్సు డ్రైవర్‌తో పెట్టుకున్న సైకిలిస్ట్.. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి
Viral Video of Bus Driver Hitting Cyclist: ఈ వీడియో చూశాకా డిక్కీ బలిచిన కోడి చికెన్ షాపు ముందుకొచ్చి తొడ కొట్టినట్టే అనే పంచ్ డైలాగ్ కి అచ్చం దృశ్య రూపంలా ఉంది కదూ. ఇంతకీ ఏం జరిగిందంటే.. సిటీ బస్సు ముందు వెళ్తున్న ఓ సైక్లిస్ట్ తన దారిన తాను సైకిల్ తొక్కుతూ వెళ్లిపోకుండా అనవసరంగా ఆ సిటీ బస్సు డ్రైవర్ తో పెట్టుకున్నాడు.
Viral Video of Bus Driver Hitting Cyclist: డిక్కీ బలిచిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తొడ కొట్టిందట.. శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఆగడు మూవీలో మహేష్ బాబు చెప్పిన ఈ పంచ్ డైలాగ్ అప్పటికీ ఇప్పటికీ అంతే పాపులర్ అనే సంగతి తెలిసిందే కదా.. ఇదిగో ఈ వీడియో చూస్తే కూడా మీకు అదే డైలాగ్ గుర్తుకొస్తుంది. బలహీనులు బలవంతులతో పెట్టుకోవడంలో తప్పు లేదు. కానీ అది బలహీనుల తప్పు లేనంత వరకైతే పర్వాలేదు కానీ అనవసరంగా వెళ్లి బలవంతుడి ముందు నిలబడి రెచ్చగొడితే ఊరుకుంటారా చెప్పండి ? ఊరుకోరు కదా.. బలవంతుడికి కోపం వస్తే.. అకారణంగా తనను రెచ్చగొట్టిన బలహీనుడిపై రెచ్చిపోతే ఆ సీన్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇదిగో ఈ వీడియో చూడాల్సిందే.
ఈ వీడియో చూశాకా డిక్కీ బలిచిన కోడి చికెన్ షాపు ముందుకొచ్చి తొడ కొట్టినట్టే అనే పంచ్ డైలాగ్‌కి అచ్చం దృశ్య రూపంలా ఉంది కదూ. ఇంతకీ ఏం జరిగిందంటే.. సిటీ బస్సు ముందు వెళ్తున్న ఓ సైక్లిస్ట్ తన దారిన తాను సైకిల్ తొక్కుతూ వెళ్లిపోకుండా అనవసరంగా ఆ సిటీ బస్సు డ్రైవర్ తో పెట్టుకున్నాడు. దానికి భారీ మూల్యం చెల్లించుకుని తగిన ఫలితం అనుభవించాడు.
సిటీ బస్సును ముందుకు పోనివ్వకుండా ఆ బస్సు ముందే నెమ్మదిగా సైకిల్ తొక్కుతూ.. మధ్య మధ్యలో సైకిల్ బ్రేక్స్ వేస్తూ పోనిస్తున్నాడు. సైక్లిస్ట్ బ్రేక్స్ వేసినప్పుడల్లా తాను బ్రేక్స్ వేస్తూ.. అతడి వెనకాల వెళ్లడం సిటీ బస్సు డ్రైవర్‌కి ఇబ్బందిగా మారింది. సైకిల్‌పై కూర్చున్న వ్యక్తి ఆకతాయి కుర్రాడు అని గుర్తించిన బస్ డ్రైవర్.. అతడికి తెలివిగా తనదైన స్టైల్లో సరైన గుణపాఠం చెప్పాడు.
సైకిలిస్ట్ బ్రేక్స్ వేసిన ప్రతీసారి తాను కూడా బ్రేక్ వేస్తూ వెళ్లి విసిగిపోయిన బస్ డ్రైవర్.. ఈసారి తాను బ్రేక్స్ వేయకుండా నెమ్మదిగా సైకిలిస్ట్‌కి తన బస్సుతోనే ఒక చిన్న కిస్ ఇచ్చాడు. దీంతో అతడి సైకిల్ వెనుక చక్రం బస్సు కింద పడి నలిగి షేపౌట్ అయింది. తాను చేసిన తప్పేంటో ఆ సైక్లిస్ట్‌కి అప్పటికీ కానీ తెలిసిరాలేదు. కానీ అప్పుడు చేయగలిగింది ఏమీ లేకపోవడంతో సైలెంటుగా పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. అందుకే అకారణంగా ఒకరిని ఇబ్బంది పెట్టోద్దు.. లేదంటే ఇలాగే సీన్ సితార అవుతుందని ఈ వైరల్ వీడియో ఒక సందేశం ఇస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి : Leopard Attacks on Vehicle: వాహనంలో వెళ్తున్న వారిపైకి దూకిన చిరుతపులి.. వీడియో వైరల్
ఇది కూడా చదవండి : Lockdown in India: ఇండియాలో వారం రోజుల పాటు లాక్‌డౌన్ ? ఇందులో నిజమెంత ?
ఇది కూడా చదవండి : 1000 Notes Coming Back: 1000 రూపాయల నోట్లు మళ్లీ వస్తున్నాయా ? 2 వేల నోట్లు బ్యాన్ ? ఏది నిజం ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook