Woman Escapes Toilet Using Eyeliner And Cotton bud: కొన్నిసార్లు మనం అనుకోని ఆపదల్లో చిక్కుకుంటాం. అలాంటి సమయంలో మనం స్పందించే విధానంను బట్టి, రిస్క్ నుంచి బైటపడటానికి అవకాశం ఉంటుంది. కొందరు ఎంత పెద్ద ప్రాబ్లమ్స్‌ లలో చిక్కుకున్న కూడా అస్సలు టెన్షన్ పడరు. కూల్ గా ఆలోచించి, రిస్క్ నుంచి ఎస్కెప్ అవుతారు. కొన్నిసార్లు మనం షాపింగ్ మాల్స్, సినిమా హల్ లకు వెళ్లినప్పుడు కొందరు బాత్రూమ్ లకు వెళ్తుంటారు. సమయం అయిపోయినప్పుడు, మాల్స్ లను క్లోజ్ చేస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Insulin: ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉందా? ఈ 3 ఆకులను నమిలండి చాలు.. షుగర్ కంట్రోల్ అవుతుంది..!


ఇలాంటి సమయంలో కొందరు మాల్స్ లలో చిక్కుకునిపోతుంటారు. ఆ తర్వాత ఫోన్ లు లేదా గట్టిగా అరవడం చేసి ఎలాగోలా బైటికొస్తుంటారు. అయితే.. యూకేలోని ఒక లేడీ డాక్టర్ కు కూడా ఇలాంటి వింత అనుభవం ఎదురైంది. ఈ ఘటనలో మాత్రం ఆమె టెన్షన్ పడకుండా కూల్ గా.. కాటన్ బడ్స్, ఐలైనర్ లను ఉపయోగించి, చాకచక్యంగా తప్పించుకుంది. 


డాక్టర్ క్రిస్టినా ఇల్కో.. యూకేలోని కేంబ్రిడ్జ్ లో యూనివర్సీటిలో పనిచేస్తుంది. ఆమె కొన్నిరోజుల క్రితం ఎదుర్కొన్న ఒక షాకింగ్ ఘటనను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. స్థానికంగా ఉన్న క్వీన్స్ కాలేజీకి వెళ్లినప్పుడు ఆమెను గమనించకుండా సెక్యురిటీ సిబ్బంది డోర్ లాక్ చేసి వెళ్లిపోయాడు. ఆమె ఎంత అరిచిన ఎవరు కూడా రెస్సాండ్ కాలేదు. ఆమె ఫోన్ కూడా మర్చిపోయింది. అప్పుడు ఆమె కాస్త తన బుర్రను ఉపయోగించింది.


బాత్రూమ్ తలుపులు, అద్దాలు పగలకొడుదామంటే అవి ఎంతో మందంగా ఉన్నాయి. అక్కడ బైట నుంచి లాక్ చేసి వెళ్లిపోయాడు. దాదాపు ఆమె డోర్ తెరవడానికి ఏడు గంటల పాటు కష్టపడింది. కానీ డోర్ మాత్రం తెరుచుకోలేదు. చివరకు ఆమె... ఒక ఐడియా వేసింది. తన దగ్గర ఉన్న ఐలైనర్, కాటన్ బాల్ తో.. టెంపరరీ లాక్ పిక్ ను ఏర్పాటు చేసింది. ఎంతో కష్టపడితే చివరకు ఆమె తయారు చేసిన లాక్ పిక్ తెరుచుకుంది. దీంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఆమె తన టాలెంట్ తో డోర్ ను తెరిచింది.


Read More: Rashmi Gautam Pics: హాట్ బాంబ్ పేల్చిన రష్మి.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు..


కానీ ఆ కాలేజీకి రెండు రోజులు హలీడేస్ ఉన్నాయంట.. ఒక వేళ ఆమె లాక్ పిక్ తో డోర్ తెరుచుకోకపోతే పరిస్థితి ఏంటని కూడా ఆమె టెన్షన్ గా ఫీలవుతుంది. ఏది ఏమైన రిస్క్ సమయంలో తన ఐలైనర్, కాటన్ బాల్ లతో డోర్ ఓపెన్ చేసుకొవడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె చెప్పింది. తాజాగా, ఆమె తన ఇన్ స్టాలో ఈ ఘటన గురించి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook