Centipede Found In Idly: హోటల్‌లో శుచీ శుభ్రత పాటించకుండా కొనసాగిస్తుండడంతో ఆహార పదార్థాల్లో క్రిమీ కీటకాలు పడుతున్నాయి. ఇలాగే ఓ హోటల్‌లో ఇడ్లీ కోసం వెళ్తితే జెర్రీ కూడా వచ్చింది. హోటల్‌ నిర్వాహకులను నిలదీస్తే అది జెర్రీ కాదు దారమని బుకాయించారు. ఇక నమ్మించేందుకు జెర్రీ కాస్త నోట్లు వేసుకున్నారు. అయితే అది జెర్రీ కావడంతో వెంటనే కక్కేశాడు. ఈ దారుణ సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జెర్రీ సంఘటనతో వినియోగదారులు, హోటల్‌ నిర్వాహకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Obscene Videos: కేబుల్ టీవీలో అశ్లీల వీడియోలు.. దిగ్భ్రాంతికి లోనయిన కుటుంబసభ్యులు


 


జగిత్యాలలో ప్రముఖ గణేశ్‌ భవన్ ఉడిపి హోటల్ ఉంది. ఈ హోటల్‌లో ఆదివారం ఓ వినియోగదారుడు వచ్చి ఇడ్లీ ఆర్డర్‌ ఇచ్చాడు. ఇంటికి తీసుకెళ్లి పిల్లలకు తినిపించే సమయంలో చనిపోయిన జెర్రీ కనిపించింది. ఇది చూసి కుటుంబసభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే వాటిని అలాగే తీసుకెళ్లి యజమానకి చూయించారు. వినియోగదారుడు నిలదీయడంతో హోటల్‌ యజమాని బుకాయించే ప్రయత్నం చేశారు. అది జెర్రీ కాదు దారమని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా దానిని నోట్లో వేసుకున్నాడు. అయితే నిజంగంటే జెర్రీ కావడంతో వెంటనే అతడు ఉమ్మివేశాడు.

Also Read: దసరా పండుగకు లక్షల్లో మద్యం వ్యాపారం.. వైన్స్‌లోకి దూకి రూ.12 లక్షలు చోరీ


 


ఇడ్లీలు నాసిరకం వండడంతో వెంటనే చెత్త తరలించే ట్రాక్టర్‌లో పారేసేందుకు ప్రయత్నించగా వినియోగదారులు అడ్డుకున్నారు. ఇడ్లీలతో రోడ్డుపై బైఠాయించి హోటల్‌ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. జెర్రీలు, బల్లులు, ఈగలు, దోమలు పడితే అలాగే తినాలా? అని వినియోగదారులు నిలదీశారు. వెంటనే హోటల్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే హోటల్‌ను సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.


పూరి అడిగితే దాడి
ఈ ఘటన జరగకుముందే జగిత్యాలలో ఆదివారం ఒక గొడవ జరిగింది. కొత్త బస్టాండ్ ఔట్ గేట్ ఎదురుగా నందిని హోటల్‌లో యజమాని, సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. పూరీ ఇవ్వమని వినియోగదారుడు కోరగా.. లేదని చెప్పారు. అంతేకాకుండా దుర్భాషలాడారు. దీంతో వినియోగదారుడు, యజమాని మధ్య మాటల యుద్ధం సాగింది. హోటల్‌ నిర్వాహకులు తనపై దాడి చేశారని బాధితుడు కిషన్‌ ఆరోపించాడు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి