Chimpanzee washing clothes, video goes viral: చింపాంజీలను మీరు ఎప్పుడైనా గమనించారా ? అవి ప్రవర్తించే తీరును నిశితంగా పరిశీలించారా ? రియల్ లైఫ్‌లో చింపాంజీలను చూసే అవకాశం అందరికీ రాకపోవచ్చునేమో కానీ రీల్ లైఫ్‌లో మాత్రం ఎన్నోసార్లు చూసే ఉంటారు. చింపాంజీలు (Chimpanzee viral videos) ప్రవర్తించే తీరు, చేష్టలు మనుషులకు ఇంచుమించు దగ్గరిగా ఉంటాయని అంటుంటారు. అందుకు కారణం అవి కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో అచ్చం మనుషుల్లాగే ప్రవర్తించడమే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంకా చెప్పాలంటే చింపాంజీల ఇష్టాయిష్టాలు కూడా మనుషుల అభిరుచికి దగ్గరిగానే ఉంటాయట. ఏంటి నమ్మలేకపోతున్నారా ? అయినా ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నట్టు అనే డౌట్ వస్తోందా ? అయితే, ఇదిగో ఈ వైరల్ (Chimpanzee viral videos) వీడియో చూడండి.. అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నట్టో మీకే అర్థమవుతుంది.



 


అదండీ సంగతి. ఒక యెల్లో కలర్ టీషర్టును నీళ్లలో తడిపి, డిటర్జెంట్ సోప్ పెట్టి, బ్రష్ రుద్ది మరీ ఆ టీ షర్టును ఉతికేస్తోంది (Chimpanzee washing tee shirt) ఈ వీడియోలో ఉన్న చింపాంజీ. ఈ చింపాంజీ టీషర్ట్‌ను వాష్ చేసే విధానం చూస్తే... ఎవరికైనా ఔరా అనిపించకమానదు. అందుకే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. 


చింపాంజికి ఉన్న తెలివి చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. తమ కామెంట్స్‌తో చింపాంజీని (Chimpanzee washing clothes) ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఒక వైపు నుంచి షూట్ చేసిన వీడియో ట్విటర్‌‌లో, మరో వైపు నుంచి షూట్ చేసిన వీడియోను యూట్యూబ్‌లోనూ పోస్ట్ చేయగా.. నెటిజెన్స్ ఆ రెండు వీడియోలపై లైకుల వర్షం కురిపిస్తున్నారు.