china man smuggling 104 live snakes in his trousers: సాధారణంగా మనం ఎయిర్ పోర్టుల్లో తరచుగా బంగారం స్మగ్లింగ్ చేయడం చూస్తుంటాం. కొందరు వజ్రాలు కూడా అక్రమంగాస్మగ్లింగ్ లు చేస్తుంటారు. పోలీసులు కళ్లుగప్పి.. తప్పించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు.అంతేకాకుండా.. లోదుస్తులు, పొట్ట భాగం,చెప్పుల సైండిల్స్ కు ఇలా అనేక చోట్ల బంగారంను పేస్టుల మాదిరిగా పెట్టుకుని తీసుకెళ్తుంటారు. మరికొందరు మలం మార్గంలో కూడా బంగారంను పెట్టుకుని, స్మగ్లింగ్ చేస్తుంటారు. ఇదంతా మనకు తెలిసిందే. కానీ ఇక్కడోక వ్యక్తి మాత్రం ఏకంగా పాముల్ని స్మగ్లింగ్ చేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. వందకు పైగా బతికున్నపాముల్ని సీక్రెట్ గా కవర్ లలో పెట్టుకుని స్మగ్లింగ్ల కు ట్రై చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



పాముల్ని చూస్తేనే చాలా మంది భయంతో పారిపోతారు.. పాముల దగ్గరకు వెళ్లడానికి అస్సలు ధైర్యం చేయరు. ఎలుకల కోసం పాములు మనుషుల ఇళ్లకు వస్తుంటాయి. అడవులు, పొలాలు, వడ్లు, బియ్యం ఉన్న చోట ఎలుకలు, ఎలుకల కోసం పాములు వస్తుంటాయి. కొన్నిసార్లు మనుషులు పాముల కాటుకు గురైచనిపోతుంటారు.. మరికొన్నిసార్లు మనిషి,సరైన సమయానికి ట్రీట్మెంట్ తీసుకుంటే పాముల కాటు నుంచి బైటపడొచ్చు. ఇక్కడోక విచిత్ర ఘటన మాత్రం వార్తలలో నిలిచింది. చైనాలోని ఒక వ్యక్తి ఏకంగా పాముల్ని తనప్యాంటులో పెట్టుకుని స్మగ్లింగ్ కు పాల్పడ్డాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


తాజాగా చైనాలోని షెన్‌జెన్ నగరంలో పాము స్మగ్లింగ్‌కు సంబంధించిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక దేశం నుంచి మరో దేశానికి సరిహద్దుల గుండా బంగారం, జంతువుల అక్రమ రవాణా పెరుగుతోంది. దీంతో కస్టమ్స్ అధికారులు గట్టి నిఘాపెట్టారు. తాజాగా చైనాలోని షెన్‌జెన్ నగరంలో పాము స్మగ్లింగ్‌కు సంబంధించిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. మోసగాళ్లు ప్రతిసారీ వివిధ మార్గాల్లో స్మగ్లింగ్‌కు ప్రయత్నిస్తుంటారు. అయితే చైనాలో ఈ పాము స్మగ్లింగ్ విధానం చాలా షాకింగ్ గా ఉంది.


 చైనా,హాంకాంగ్ సరిహద్దులో ఉన్న షెన్‌జెన్ నగరంలో 100 కంటే ఎక్కువ పాములను కలిగి ఉన్న వ్యక్తిని పట్టుకున్నారు. సదరువ్యక్తి .. స్మగ్లింగ్ విధానం చూసి కస్టమ్స్ అధికారులే ఆశ్చర్యం పోయారు. నిందితుడు వందకు పైగా.. పాములను తన ప్యాంటులో దాచుకున్నాడు. ఈ పాములను చైనాకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు.


చైనా కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణికుల తనిఖీల్లో నిందితుడు పట్టుబడ్డాడు. నిందితుడి ప్యాంటు జేబులో ఆరు కాన్వాస్ డ్రాస్ట్రింగ్ బ్యాగులు ఉన్నాయి. ఈ సంచులలో పాములు సీలు చేయబడ్డాయి. బ్యాగ్‌లో రకరకాల సైజుల్లో, రంగు రంగుల సజీవ పాములు ఉన్నాయి. నిందితుల నుంచి కస్టమ్స్ అధికారులు.. 104 పాములను స్వాధీనం చేసుకున్నారు.


Read more: Viral video: ముంబైలో వర్షం బీభత్సం... రైలు పట్టాలపై తిరుగుతున్న చేపలు.. వీడియో వైరల్..


ఇందులో పాల పాము, మొక్కజొన్న పాము కూడా ఉన్నాయి. వీటిలో చాలా పాములు చైనాలో ఉండనివే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో జంతువుల అక్రమ రవాణాలో చైనా టాప్ లో ఉంది. ఇక్కడ మనుషులు..ప్రతి ఒక్క జీవిని కూడా తింటూ ఉంటారు. ఇక్కడ జంతువులు, ముఖ్యంగా పాములకు ఫుడ్ డిమాండ్ ఉంది. అందుకే పాముల్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  అయితే గత కొన్నేళ్లుగా ఈ అక్రమ వ్యాపారంపై అధికారులు నిఘా పెట్టారు. ఎక్కడ కూడా జంతువులు స్మగ్లింగ్ జరక్కుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటన మాత్రం వైరల్ గా మారింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి