Tamatalaku Cobra Kapala Viral Video: గతంలో టమాటో ధరలు నింగికి చేరిన వార్తలను తరచుగా విన్న సంగతి అందరికీ తెలిసిందే.. అలాగే పేపర్లలో పెద్ద పెద్ద హెడ్ లైన్స్ తో కొన్ని ప్రాంతాల్లో టమాటాలను చోరీ చేసిన న్యూస్లను కూడా చూసి ఉన్నాం.. అంతేకాకుండా ఒక ప్రాంతంలో టమాటో పండించిన రైతు పంటస్థలం నుంచి నేరుగా దొంగలు టమాటోలను చోరీ చేసిన విషయం తెలిసిందే. అలాగే మార్కెట్ యార్డులో కొంతమంది యజమానులు కొనుగోలు చేసిన టమాటాలను కొంతమంది దుండగులు దొంగలించిన సంగతి కూడా గతంలో న్యూస్ లో చూసిన సంగతి అందరికీ తెలిసిందే. వీటన్నిటిని చూసిన కొంతమంది టమాటా వ్యాపారస్తులు గతంలో టమాటాల దొంగతనం జరగకుండా బౌన్సర్లను, సెక్యూరిటీలను నియమించుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా వీరికి సంబంధించిన వీడియోలు కూడా గతంలో చాలా వైరల్ అయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


టమాటాల గురించి అనేక వీడియోలు వైరల్ అవుతున్న తరుణంలోనే ఓ కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది. ఇది అన్ని వీడియోల కంటే బీభత్సంగా వైరల్ అయ్యింది. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా వైరల్ అవుతూ వస్తోంది. ఈసారి టమాటాలకు కాపలా కాస్తుంది ఎవరో కాదు.. ది గ్రేట్ కింగ్ కోబ్రా.. అవును నేను చెప్పేది నిజం.. అవును మీరు చూస్తుంది ముమ్మాటికి నిజమేనండీ.. చాలామంది ఈ సమయంలో టమాటోలకు కాపరిగా సెక్యూరిటీ బాడీ గార్డ్లను నియమించుకుంటే.. ఇక్కడ కొంతమంది టమాటో కొనుగోలుదారులు మాత్రం కింగ్ కోబ్రాను సెక్యూరిటీగా నియమించుకున్నారు. 



గతంలో టమాటో ధరలు ఒక్కసారిగా పెరగడంతో.. ఓ టమాట వ్యాపారస్తుడు ఏకంగా తన కొనుగోలు చేసిన టమాటో సరుకును దొంగల నుంచి రక్షించుకోవడానికి భారీ కింగ్ కోబ్రా ను కాపలాగా పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాకుండా ఆ పాము టమాటోలపై పడగవిప్పి ఉండడం చూపరులను ఆకర్షిస్తోంది. అంతేకాకుండా అక్కడ ఎవ్వరు టమాటోలను ముట్టుకోవాలని చూసిన పాము ఎంతో ఆసక్తిగా కాటేయాలని చూస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. 


గతంలో సినిమాల్లో మనం తరచుగా బంగారం వజ్రాలు, ఇతర కాస్ట్లీ వస్తువులు కాపాడేందుకు పాములను అష్టదిగ్భందనాల్లో ఉంచేవారు. వీటిని హీరోలు, విలన్స్ ఎంతో కష్టపడి పాములను తప్పించుకొని ఆ నిధిని బయటకి తీసుకువచ్చేవారు.. అయితే పాము టమాటోలకు కాపలా కాయడం చూస్తుంటే అదే సీన్ రిపీట్ అయినట్టు అనిపిస్తోంది. ఈ దృశ్యాలను నేటిజన్స్ తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇదేంది రా బాబు అని కామెంట్లు కూడా చేస్తున్నారు. నిజానికి ఇలా తరచుగా ఎన్నో వింత వింత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.