couple spends two hours on submerged car in Gujarat floods video: దేశమంతాట కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వరుణుడి ధాటికి అనేక రాష్ట్రాలు అల్లకల్లోలంగా మారుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వానల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారిపొయింది. అనేక చోట్ల రోడ్లన్ని కోట్టుకుని పోయాయి. రైల్వే వంతెనలు కూడా కొట్టుకుని పోయాయి. గ్రామాల్లో వంతెనలు తెగిపోయాయి. అంతేకాకుండా.. గ్రామంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



చెరువుల్లోని కట్టలు సైతం తెగిపోతున్నాయి. ఎక్కడ చూసిన గ్రామాల్లోనే కాకుండా.. నగరాల్లో సైతం రోడ్లమీదకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక చోట్ల జనాలు వర్షంలో సైతం ఇరుక్కుని ఇబ్బందులు పడిన ఘటనలు వార్తలలో నిలిచాయి. కొంత మంది భారీ వర్షంలో కాల్వలు దాటేందుకు ప్రయత్నించి, ప్రాణాల మీదకు సైతం తెచ్చుకున్నారు. ఇలాంటి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు..


గుజరాత్ రాష్ట్రాన్ని వరదలు వణికిస్తున్నాయి.  ఈ క్రమంలో అక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడ చూసిన కూడా నీళ్లు కన్పిస్తున్నాయి. జన జీవనమంతా స్తంభించి పోయిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బైటకు రావొద్దని సైతం.. అధికారులుఆదేశాలు జారీ చేస్తున్నారు. అయిన కూడా కొంత మంది తమ ప్రాణాలను సైతం డెంజర్ లో పెట్టి వరదల్లో బైటకు వెళ్లి తమ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు.


గుజరాత్ లోని సాబార్ కాంఠా జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడ కరోల్ నది పొంగి పొర్లుతుంది. ఈ క్రమంలో.. సురేష్ మిస్త్రీ అనే వ్యక్తి తన భార్యతో కలిసి, కారులో ప్రయాణిస్తున్నాడు. ఇంతలో వరద ఎక్కువగా కావడంతో.. కారు నదిలో దాదాపు 2 కిలో మీటర్ల వరకు కొట్టుకుని పోయింది. చివరకు ఆ కారు.. ఒక చోట ఆగిపోయింది.


Read more: Rhinoceros: ఇదేక్కడి విడ్డూరం.. సింహాలకు చుక్కలు చూపించిన ఖడ్గమృగాలు.. వీడియో చూస్తే షాక్ అవుతారు..


కానీ కారు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. కారు టాప్  మీద కూర్చుని, ఆ జంట తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్నిచూసిన నెటిజన్ లు షాకింగ్ కు గురౌతున్నారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.