Cow roming and eating Medical waste in Government Hospital ICU in Rajgarh: హాస్పిటల్ ఐసీయూ అనగానే.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న పేషంట్స్‌ చికిత్స తీసుకుంటారని మనకు వెంటనే గుర్తొస్తుంది. ఐసీయూలో పేషంట్స్‌, డాక్టర్లతో హడావిడిగా ఉంటుంది. ఒక్కోసారి ఐసీయూలోని పేషంట్‌లను చూసేందుకే కుటుంబ సభ్యులను కూడా ఆసుపత్రి సిబ్బంది అనుమతించరు. ప్రత్యేక సమయాల్లో మాత్రమే పేషంట్‌లను చూసేందుకు అనుమతిస్తారు. అలాంటి ఐసీయూలోకి ఏకంగా ఓ ఆవు ప్రవేశించి.. దర్జాగా చక్కర్లు కొట్టింది. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గర్‌లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో షాకింగ్ సంఘటన జరిగింది. ఓ ఆవు ఏకంగా ఐసీయూలోకి ప్రవేశించింది. అనంతరం కొద్దిసేపు ఐసీయూ వార్డులో చక్కర్లు కొట్టింది. అక్కడే తిరుగుతూ ఆసుపత్రి ఆవరణలోని చెత్త డబ్బాలో అన్న మెడికల్‌ వ్యర్థాలను తింది. ఆవును బయటకు పంపించే వారు అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆసుపత్రిలో దర్జాగా తిరిగింది. సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ.. ఆవు ఏకంగా ఐసీయూలోకి వచ్చి తిరగటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 


ఆవు ఐసీయూలోకి వచ్చి మెడికల్ వేస్ట్ తింటుండడాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. విషయం తెలుసుకున్న రాజ్‌గర్‌ ఉన్నతాధికారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది అంతా ఉలిక్కిపడ్డారు. సీనియర్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు రంగంలోకి దిగి ఆసుపత్రిలో పని చేసే ఒక సెక్యూరిటీ గార్డు సహా ముగ్గురు సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఏదేమైనా ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారనడానికి ఈ వీడియో మంచి ఉదాహరణ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 


Also Read: భారత్, న్యూజిలాండ్‌ మూడో టీ20.. ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!


Also Read: పెళ్లైన వ్యక్తి ప్రేమలో మానుషి.. కోటీశ్వరుడేనండోయ్, బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.