Currency Note Bidding: అవును.. ఆ కరెన్సీ నోటు విలువ ఏకంగా రూ. 1.30 కోట్లు!
Currency Note Bidding: లండన్‌లోని స్పింక్ ఆక్షన్ హౌస్‌లో ఓ పురాతన కరెన్సీ నోట్ ఏకంగా రూ. 1.30 కోట్లు పలికింది. దీనిపై ఇటీవలే జరిగిన బిడ్డింగ్ లో అది భారీ ధరకు అమ్ముడుపోయింది. అయితే దీని వెనుక ఉన్న కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Currency Note Bidding: కొంత మందికి పాత నాణేలు, నోట్లు సేకరించటం అలవాటుగా ఉంటుంది. అలాంటి సేకరించే వారు పురాతన కరెన్సీ నోట్లను సొంతం చేసుకునేందుకు లక్షలాది రూపాయలను వెచ్చిస్తుంటారు.
లండన్‌లోని స్పింక్ ఆక్షన్ హౌస్‌లో ఇటీవలే జరిగిన వేలంలో ఓ పురాతన కరెన్సీ నోట్ భారీ ధర పలికింది. పాలస్తీనాకు చెందిన 100 పౌండ్స్ కరెన్సీ నోట్ ను వేలానికి ఉంచగా.. దాన్ని సుమారు రూ. 1.30 కోట్లకు సొంతం చేసుకున్నారు.
Mirror.comలోని ఒక నివేదిక ప్రకారం.. పాల్ వైమాన్ ఆక్స్‌ఫామ్‌లో స్వచ్ఛందంగా పనిచేస్తున్నప్పుడు విరాళంగా ఇచ్చిన వస్తువులను వేలం వేశారు. అయితే అందులో పురాతన పాలస్తీనా 100 పౌండ్స్ నోట్ ఉంది. దాని విలువ సుమారు రూ. 30 వేలుగా ఉంటుంది. కానీ, దీని వేలంలో రూ. 1.3 కోట్లకు అమ్ముడుపోయింది.
Also Read: Tattoo on Face: మద్యం మత్తులో ఈ వ్యక్తి ఏం చేశాడో చూడండి- వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.