Man Arrested For Cutting Cake With Pistol: ఢిల్లీలో ఒక వ్యక్తి తుపాకీతో బర్త్ డే వేడుకలు చేసుకుంటూ అదే తుపాకీని కత్తిలా ఉపయోగించి కేక్ కట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో అతడు తుపాకీతో హల్‌చల్ చేస్తూ కత్తితో కోయాల్సిన కేకును తుపాకీతో కత్తిరిస్తూ కనిపించాడు. ఈ వీడియో వైరల్ గా మారిన నేపథ్యంలో అది కాస్తా ఢిల్లీ పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న ఢిల్లీ పోలీసులు.. ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిని ఎవరో గుర్తించి సంఘం విహార్‌లోని  నేబ్ సరాయి నుంచి అదుపులోకి తీసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిందితుడి నుంచి .315 బోర్ పిస్టల్ తో పాటు 2 లైవ్ రౌండ్స్ కలిగిన కాట్రిడ్జెస్ ని స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాల చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. నిందితుడిని అనికేత్ అలియాస్ అనిశ్‌గా గుర్తించారు. గతంలోనూ ఢిల్లీలోని మాళవియా నగర్‌లో అనిష్ మరో కేసులో నిందితుడిగా ఙన్నాడు. 


ఈ ఘటనపై సౌత్ ఢిల్లీ డిసీపీ చందన్ చౌదరి మాట్లాడుతూ.. సంఘం విహార్ లో ఒక వ్యక్తి తుపాకీతో తిరుగుతూ హల్ చల్ చేస్తున్నట్టుగా తమకు సమాచారం అందిందని.. సంఘం విహార్ లోని నెబ్ సరాయిలో అతడు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. చాకచక్యంగా వ్యవహరించి, అతడికి తిరగబడే అవకాశం కూడా ఇవ్వకుండా తమ అదుపులోకి తీసుకున్నాం అని డీసీపీ చందన్ చౌదరి తెలిపారు. 



 


ఈ ఘటనపై నిందితుడు అనికేత్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వైరల్ అవడం కోసమే తాను ఈ పని చేశానని అంగీకరించాడు. స్థానికంగా ఉండే ఇతర నేరస్తుల ఎదుట తానేంటో నిరూపించుకోవడంతో పాటు స్థానిక యువత దృష్టిలో తన పాపులారిటీ పెరుగుతుంది అని భావించినట్టు పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఈ వివరాలను బహిర్గతం చేస్తూ ఢిల్లీ పోలీసులు సైతం ట్విటర్ ద్వారా ఓ వీడియో షేర్ చేసుకున్నారు. మారణాయుధాలతో వెర్రీ వెషాలేస్తే.. ఇలాగే ఊచలు లెక్కబెట్టిస్తాం అని చెప్పి ఇలాంటి ఆకతాయిలకు ఢిల్లీ పోలీసులు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు.


ఇది కూడా చదవండి : Husband And Wife Viral News: ప్రియుడితో పెళ్లి చేయించాల్సిందిగా డిమాండ్ చేస్తూ పోలీసు స్టేషన్‌లో వివాహిత రచ్చరచ్చ


ఇది కూడా చదవండి : Golden Treasure in Fort: స్వతంత్రం వచ్చిన 30 ఏళ్లకు పాకిస్థాన్ ప్రధాని కన్నేసిన కోట.. కోట నిండా 60 ట్రక్కుల రహస్య నిధి


ఇది కూడా చదవండి : Couple First Night Video: పొరపాటున సోషల్ మీడియాలో ఫస్ట్ నైట్ వీడియో పోస్ట్.. ఫుల్ వైరల్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK