Delhi Metro Viral Video: ఢిల్లీ మెట్రోలోని మరో వీడియో వైరల్.. ఏం జరిగిందంటే..
Delhi Metro Viral Video: ఢిల్లీ మెట్రోలో జరుగుతున్న సంఘటనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇటీవలే ఇద్దరు వాగ్వాదానికి దిగిన ఓ వీడియో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.. ఇటీవలే ఓ అమ్మాయి యువకుడిని చెంప పగలగొట్టే వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.
Delhi Metro Viral Video: గత కొంత కాలంగా ఢిల్లీ మెట్రోలో జరిగే ప్రతి సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా మెట్రోలో రొమాన్స్ చేసుకుంటున్న సన్నివేశాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. అయితే ఇటీవలే ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఓ యువతి అరుస్తూ యువకుడి చెంపను చెల్లుమనిపించడంతో మరోసారి నెట్టింట ఢిల్లీ మెట్రో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ అమ్మాయి ఆ యువకుడి చెంపపై కొట్టడానికి గల కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఢిల్లీ మెట్రో తగాదాలకు నిలయంగా మారుతోంది. మనం ఈరోజు వైరల్ అవుతున్న వీడియోలు గమనిస్తే.. మెట్రో ఆగగానే యువతి యువకుడు అందులోకి ఎక్కుతారు. మాట్లాడుతూ ఉండగానే వారిద్దరి మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ఇది కాస్త పెద్ద గొడవగా మారుతుంది. ఈ వీడియోలో ముందుగా అమ్మాయి గట్టిగా అరుస్తూ కనిపించింది. నేనెప్పుడో ఇంస్టాగ్రామ్ ఖాతాలోని చాట్ డిలీట్ చేశానని అంతేకాకుండా ఫోన్ నెంబర్ కూడా బ్లాక్ లిస్టులో పెట్టానని, ఇలా నువ్వు ప్రతిసారి నా మొబైల్ ను చెక్ చేయడం సరికాదని.. అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఆ యువకుడి చెంపను చెల్లుమనిపించింది.
ఆ యువతి మెట్రోలో గట్టిగా గట్టిగా అరవడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ఆమె వైపు చూశారు. అయినప్పటికీ ఆ యువతి ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళీ అరవడం మొదలు పెట్టింది. అంతేకాకుండా ఆ యువకుడుని రెండోసారి కొట్టే ప్రయత్నం కూడా చేసింది. అయితే అక్కడున్న ప్రయాణికులు ఆమెను చూస్తున్నారని గమనించి కొట్టలేకపోయింది. ఇద్దరి మధ్య ఎలాంటి వాగ్వాదమైన జరిగి ఉండొచ్చు.కానీ పబ్లిక్ ప్లేస్ లో ఇలా కొట్టుకోవడం మంచిది కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో
తాజాగా ఢిల్లీ మెట్రోలో జరుగుతున్న వివాదాలు నెట్టింట్లో రచ్చకెక్కడంతో అధికారులు స్పందిస్తున్నారు. ఇటీవలే జరిగిన ఈ సంఘటనపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కూడా స్పందించారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని డిఎంఆర్‌సి కోరింది. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రయాణికులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని కార్పొరేషన్ ఆకాంక్షించింది.
Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి