Police Kicking Muslim Men: ముస్లింలకు శుక్రవారం పవిత్రమైన రోజు. వారంలో మిగతా రోజులు చేసినా చేయకున్నా శుక్రవారం మాత్రం తప్పక నమాజ్‌ చేస్తారు. అలా ఈరోజు ముస్లింలంతా రోడ్డుపై నమాజ్‌ చేస్తున్నారు. అయితే అక్కడికి వచ్చిన పోలీస్‌ అధికారి అనుచితంగా ప్రవర్తించాడు. ప్రార్థనలు చేస్తున్న ముస్లింలను వెనుక నుంచి వచ్చి తన్నాడు. నమాజ్‌ చేస్తున్న వారిని తన్ని లేపాడు. ఈ పరిణామంతో ముస్లింలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Exam Forgot: మీ మతిమరుపు తగిలెయ్య.. హాల్‌ టికెట్లు ఇచ్చి పరీక్ష మరిచిన యూనివర్సిటీ

నమాజ్‌ చేస్తుండగా ఎలా దాడి చేస్తారని నిలదీశారు. ఈ సందర్భంగా ఆ అధికారిని చుట్టుముట్టి ఘెరావ్ చేశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. పోలీస్‌ అధికారి దురుసుతనాన్ని రాజకీయ పార్టీలు తప్పుబట్టాయి. అతడిని వెంటనే సస్పెండ్‌ చేయాలని.. ముస్లింలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దాడికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రజలంతా అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: NIA Reward: బాంబ్‌ పెట్టినోడిని పట్టిస్తే అక్షరాల రూ.10 లక్షల నగదు బహుమతి మీ సొంతం


ఢిల్లీలోని ఇందర్‌లోక్‌ ప్రాంతంలో రోడ్డుపై శుక్రవారం మధ్యాహ్నం ముస్లింలు 'సజ్దా' ప్రార్థనలు చేస్తున్నారు. రోడ్డుపై వాహనాల రాకపోకలకు విఘాతం కలిగిస్తూ ప్రార్థనలు చేస్తున్నారనే ఆగ్రహంతో ఓ పోలీస్‌ అధికారి వచ్చాడు. నమాజ్‌ చేస్తున్న ముస్లిం యువకులను తన్ని లేపాడు. ఈ సంఘటనతో ముస్లిం యువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్‌తో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో అతడిపైకి దాడికి యత్నించారు.

దీనికి సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో రాజకీయ వివాదం ఏర్పడింది. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తప్పుబట్టారు. రాజ్యసభ సభ్యుడు ఇమ్రాన్‌ ప్రతాప్‌గర్హి స్పందిస్తూ.. 'పోలీస్‌ అధికారికి కనీసం మానవత్వం కూడా లేదు. అతడు ఇలాంటి దురుసు ప్రవర్తనతో ఏం సాధిస్తాడు? ఢిల్లీ పోలీసులు వెంటనే స్పందించి అతడిపై చర్యలు తీసుకోవాలి. అతడిని విధుల్లో నుంచి తప్పించాలి' అని డిమాండ్‌ చేశారు.


పోలీస్‌ అధికారి దాడి సంఘటనపై ఢిల్లీ డీసీపీ మనోజ్‌ మీనా స్పందించారు. 'ఈ సంఘటనకు సంబంధించి విచారణ చేస్తున్నాం. అతడిని తక్షణమే విధుల్లో నుంచి సస్పెండ్‌ చేశాం. శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం' అని తెలిపారు. ఇక నెటిజన్లు పోలీస్‌ అధికారిపై మండిపడుతున్నారు. 'ప్రార్థన చేసే సమయంలో అలా తన్నడం ఏమిటి' అని ప్రశ్నిస్తున్నారు. రోడ్డుపై నమాజ్‌ చేస్తుంటే అలా తన్నడం పద్ధతి కాదు అని తప్పుబడుతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి