Delhi Viral Video: 'ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు' అనేది తప్పనిసరిగా పాటించాలి. వాళ్లు చేసే పని.. వాళ్ల వేషభాష నడవడికను చూసి తప్పుగా అర్థం చేసుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. భారతదేశ సందర్శనకు వచ్చిన విదేశీయులకు ఇదే పాఠంగా మారింది. పర్యాటక ప్రాంతానికి వచ్చిన విదేశీ జంట ఓ రిక్షావాడిని నగరం తిప్పేందుకు మాట్లాడుకున్నారు. నగరంలో ఏమేమీ చూడవచ్చని అడిగితే ఆ యువకుడు టకాటకా ఇంగ్లీష్‌ భాషలో మాట్లాడేసి వారి నోరు మూయించాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మీరు అతడి భాష వింటే ఫిదా అవుతారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Minister Muddy: బురదలో ఇరుక్కుని మంత్రి తంటాలు.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు


ఢిల్లీని సందర్శించేందుకు కెనడా నుంచి ఓ జంట వచ్చింది. వారు ఢిల్లీలోని పర్యాటక ప్రాంతాలు వెళ్లేందుకు రిక్షా కార్మికుడితో మాట్లాడుకున్నారు. అక్కడ చూడడానికి ఏయే సందర్శనీయ ప్రదేశాలు బాగుంటాయని అడిగారు. అంతే రిక్షా కార్మికుడు తడబడకుండా కెనడా దంపతులకు ఇంగ్లీష్‌లో సమాధానం ఇచ్చాడు. అతడి మాట తీరుతో ఆ ఇంగ్లీష్ దంపతులు అవాక్కయ్యారు. అతడి భాష తీరును చూసి ముచ్చటపడ్డారు. వావ్‌ అంటూ అభినందించారు. ఢిల్లీలోని సందర్శనీయ ప్రదేశాలన్నింటిని చెప్పేశాడు. అక్కడ ఎక్కడెక్కడో తిరగాలో అనే విషయాలన్ని విదేశీ భాషలో చెప్పాడు. అనంతరం మళ్లీ తిరిగి తన రిక్షా ఎక్కాలని సూచించాడు. తన రిక్షాను 'హెలికాప్టర్‌'గా పిలవడం విశేషం.

Also Read: Bir Billing Dog Loyal: కన్నీటి గాథ.. యజమాని బాడీ వద్ద 48 గంటలు కాపలా కాసిన పెంపుడు కుక్క


ఢిల్లీ గొప్పదనం.. సుందర రమణీయ ప్రదేశాలను కెనడా దంపతులకు వివరించాడు. ప్రఖ్యాత జామా మసీద్‌, ఆసియాలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల మార్కెట్‌ గురించి వారికి చెప్పాడు. గల్లీలు ఉంటాయని.. అక్కడ అన్నింటిని చూసుకుంటూ ఫొటోలు దిగుతూ వెళ్లచ్చని అవగాహన కల్పించాడు. 'మీకు అర్థమైందా' అని తిరిగి వారిని ప్రశ్నించాడు. 'యా' అంటూ ఆ దంపతులు రిక్షా కార్మికుడి వెంట వెళ్లారు. 'ఇక పోదామా' అని ఇంగ్లీష్‌లో అని వారిని రిక్షాలో తీసుకెళ్లాడు. ఇదంతా అక్కడ చూస్తున్న ఒకరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. నెటిజన్లు అతడి ఇంగ్లీష్‌ చూసి ఫిదా అయిపోయారు.



కాగా, ఆ రిక్షా నడిపే యువకుడి పేరు, ఇతర వివరాలు తెలియలేదు. అయితే నెటిజన్లు అతడి గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. ఢిల్లీలోని పర్యాటక ప్రాంతాల్లో రిక్షాతో పర్యాటకులను తిప్పుతుంటాడని తెలిసింది. నిత్యం విదేశీయులను తన రిక్షాలో తిప్పుతూ సందర్శనీయ స్థలాలు చూపిస్తూ ఉండడంతో వారితో మాట్లాడి మాట్లాడి ఇంతలా ఇంగ్లీష్‌ నేర్చుకున్నట్లు తెలుస్తోంది. వారితో మాట్లాడుతూనే ఇంత గొప్పగా ఇంగ్లీష్‌ నేర్చుకున్నట్లు నెటిజన్లు చెబుతున్నారు. కాగా ఈ వీడియో పర్యాటక శాఖ అధికారులు చూసి అతడికి మంచి పర్యాటక ప్రాంతాల్లో గైడ్‌గా అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook