fire breaks in sudarshan theartre Hyderabad: ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ హీరోయిన్ గా నటించిన దేవర మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. మరోవైపు జాన్వీకు తెలుగులో ఇది తొలిసి నిమా కావడంతో ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యిందని చెప్పుకొవచ్చు. గతంలో కొరాటల శివ , ఎన్టీఆర్ కాంబోలో జనతా గ్యారేజ్ మూవీ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరు కలసి ఈ సినిమా చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీనిపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అంతే కాకుండా.. ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కూడా నటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



దీంతో ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ సినిమా చేసేందుకు పూనకాలతో ఊగిపోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా.. అని అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ సైతం.. అభిమానులు పొటెత్తడంతో నిర్వహాకులు చేతులెత్తేసిన విషయం తెలిసిందే.


ఈరోజు మూవీ విడుదల కావడంతో థియేటర్ లన్ని జాతరను తలపిస్తున్నాయి.  అయితే హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడ అభిమానులు కాస్తంత అత్యుత్సాహాం చూపించినట్లు తెలుస్తోంది.


పూర్తి వివరాలు..


హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన థియేటర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.  తమ ఫెవరేట్ హీరో నటనించిన దేవర మూవీ కోసం .. ఎన్టీఆర్ కు భారీగా కటౌట్ లు ఏర్పాటు చేసి తమఅభిమానాన్ని చాటు కున్నారు. భారీ ఎత్తున పూల మాలల్ని సైతం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. టపాసులు కాల్చి పండుగ చేసుకున్నారు. కానీ ఇక్కడ అనుకొని ఘటన చోటు చేసుకుంది.


టపాసుల నుంచి నిప్పురవ్వలు వెళ్లి.. కటౌట్ మీద పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. చూస్తుండగా.. భారీ ఫ్లెక్సీ కటౌట్ మంటల్లో తగలబడిపోయింది.  వెంటనే అక్కడున్న వారు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పేశారు. కానీ అప్పటికే భారీ కటౌట్ మంటల్లో కాలిపోయింది.


Read more: Devara OTT: దేవర ఓటీటీ డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..!


మరోవైపు.. కొంత మంది కావాలని ఈ కటౌట్ కు నిప్పుపెట్టారని కూడా టాక్ విన్పించింది. ప్రస్తుతానికి ఈ ఘటన మాత్రం వార్తలలో నిలిచింది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.