Old Man Lighting multiple rockets using a cigarette: 'దీపావళి' పండగ రోజున.. ఓవైపు దీపాలు వెలుగుతుంటే, మరోవైపు టపాకాయలు పేలుతుంటాయి. చిన్న పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు టపాకాయలు పేల్చుతుంటారు. కుటుంబంతో కలిసి సరదాగా తోక బాంబ్స్, లక్ష్మి బాంబ్స్, చిచ్చుబుడ్డులు, థౌజండ్‌వాలాలు, కాకర పుల్ల, భూచక్రాలు.. మొదలైనవి కాల్చుతుంటారు. ఎన్ని కాల్చినా, ఎంత కాల్చినా తక్కువే అనిపిస్తుంది. మరిన్ని బాంబులు కాల్చాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంటుంది. నేడు దీపావళి కాబట్టి దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టపాకాయలు కాల్చేందుకు కొందరు చాలా బయపడుతారు. మరికొందరు మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా కాల్చుతారు. దీపావళి పండగ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. వీడియోలో ఓ పెద్దాయన భయం లేకుండా టపాకాయలు కాల్చుతున్నాడు. ఈ పెద్దాయన తనకంటూ ఉన్న ప్రత్యేక స్టైల్ తో కాల్చుతున్నాడు. పెద్దాయన చేతిలో అరడజను రాకెట్లును పట్టుకుని.. నోటిలో సిగరెట్ పెట్టుకొని వెలిగించాడు. ఆ సిగరెట్‌కు తన చేతిలో ఉన్న రాకెట్లను వరుసగా ఒకదాని తర్వాత మరొకటి అంటిస్తూ పైకి వదిలాడు.



ఆ పెద్దాయన రోడ్డు మధ్యలో నిలబడి 11 రాకెట్లను కేవలం 20 సెకండ్లలోనే కాల్చేశాడు. ఇలా చేయడం అత్యంత ప్రమాదకరమైనది అయినప్పటికీ.. ఆ వ్యక్తి భయం లేకుండా రాకెట్లను కాల్చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. నిజానికి ఇది పాత వీడియోనే. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోకి 984 వేల వ్యూస్ వచ్చాయి. రాకెట్‌మ్యాన్, రజనీకాంత్ స్టైల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


Also Read: Kriti Sanon Pics: లెహంగాలో కృతి సనన్.. బాలీవుడ్ ముద్దుగుమ్మ స్మైల్‌కు పడిపోవాల్సిందే!


Also Read: Shivani Narayanan Hot Pics: శివాని నారాయణన్ అందాల ఆరబోత.. పిక్స్ చూస్తే పిచ్చెక్కిపోవడం పక్కా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి