గో మూత్రం ఆరోగ్యానికి మంచిదని, పొట్టను శుద్ధి చేసే గుణం గో మూత్రానికి ఉంటుందని చాలా విన్నాం. చాలా చూశాం. అలాగే ఆవు పేడ కూడా మంచిదే అని వాళ్లూ, వీళ్లు చెబుతుంటే చూశాం.. కానీ ఎవరైనా ఆవు పేడ తిన్నట్టుగా ఉన్న వీడియోలు మాత్రం చూసి ఉండకపోవచ్చు. కానీ ఇదిగో ఇక్కడ ఓ డాక్టర్ మాత్రం ఏకంగా ఆవు పేడ తింటే ఆరోగ్యానికి మంచిది అని చెప్పడమే కాకుండా అది నిజమని చెప్పడానికి తానే తిని చూపిస్తున్నాడు. ఏంటి నమ్మలేకపోతున్నారా ? అయితే ముందుగా ఇదిగో ఈ వీడియోపై ఓ లుక్కేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి తనని తాను డా మనోజ్ మిట్టల్‌గా పరిచయం చేసుకున్నాడు. ట్విటర్ ప్రొఫెల్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. హర్యానాలోని కర్నల్‌లో పిల్లల స్పెషలిస్ట్ డాక్టర్‌గా పనిచేస్తున్నట్టు చెప్పుకున్న సదరు వ్యక్తి పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 


వీడియో గమనించినట్టయితే.. గోశాలలో కింద పడి ఉన్న ఆవు పేడను చేతిలోకి తీసుకున్న సదరు వ్యక్తి.. దానిని మరో చేత తినడం చూడొచ్చు. ఆవు పేడ, ఆవు మూత్రంతో అనేక రకాల వ్యాధులు రాకుండా నివారించ వచ్చని చెప్పుకొచ్చడు. అంతటితో సరిపెట్టుకోని ఆ వ్యక్తి.. మరో సలహా కూడా ఇచ్చాడు. గర్భిణులు ఆవు పేడ తిన్నట్టయితే.. వారికి సిజేరియన్ అవసరం లేకుండా సహజపద్ధతిలో కాన్పు (డెలివరి) అవుతుందని సెలవిచ్చాడు. ఆవు పేడ తినడంతోనే బాడీ, మైండ్ శుద్ధి అవుతాయని.. ఆవు పేడకు అంతటి మహత్యం ఉందని చెబుతున్నాడు.



Also read : వైరల్ వీడియో: పారాసైలింగ్ చేస్తుండగా తాడు తెగి గాల్లోంచి సముద్రంలో పడిన జంట


ఈ వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో చూసిన జనం తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. కొంతమంది అతడి వాదనతో ఏకీభవిస్తుండగా.. ఇంకొంత మంది మాత్రం అతడిని ఏకిపారేస్తున్నారు. డాక్టర్ అని చెప్పుకుంటూ ఈ రకమైన సలహాలు ఇస్తున్నందుకు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అతడిపై చర్యలు తీసుకోవాలని, అతడి లైసెన్స్ రద్దు చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఇంకొంత మంది నెటిజెన్స్ కామెంట్స్ చెప్పడానికి వీల్లేకుండా ఉన్నాయి.


Also read : Man praying god before stealing hundi: హుండి ఎత్తుకెళ్లడానికొచ్చి ఏం చేశాడో చూడండి.. వైరల్ వీడియో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook