Dog Doctor Viral Video: కుక్కను కారుకు కట్టేసి.. కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డాక్టర్! కారణం తెలిస్తే షాక్ అవుతారు
Viral Video, Jodhpur Doctor tied the Dog and Dragged it on Road. ప్రాణాలు కాపాడి.. మానవత్వం చూపించాల్సిన స్థానంలో ఉన్న ఓ డాక్టర్.. వీధి కుక్కతో అమానుషంగా ప్రవర్తించాడు.
Viral Video, Jodhpur Doctor tied the Dog and Dragged it on Road: ప్రస్తుత కాలంలో మనుషులు మానవత్వం మరిచిపోతున్నారు. మనుషులతోనే కాకుండా మూగ జీవాల పట్ల కూడా కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ప్రాణాలు కాపాడి.. మానవత్వం చూపించాల్సిన స్థానంలో ఉన్న ఓ డాక్టర్.. వీధి కుక్కతో అమానుషంగా ప్రవర్తించాడు. తన ఇంటివద్ద ఉండే ఓ వీధి కుక్కను తన కారుకు కట్టేసి ఊరంతా తిప్పాడు. కారు వేగంతో పరిగెత్తలేకపోయిన ఆ కుక్క చిత్రహింస అనుభవించింది. ఈ అమానుష ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...
జోధ్‌పూర్‌కు చెందిన డాక్టర్ రజనీశ్ గల్వా స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జన్. ఆ ప్రాంతంలో రజనీశ్ చాలా ఫేమస్ కూడా. రజనీశ్ గల్వా ఇంటి సమీపంలో ఓ వీధి కుక్క ఉంది. అది ఎప్పుడూ డాక్టర్ ఇంటి ముందు తిరుగుతుండేది. మానవత్వంతో ఆహారం అందించాల్సింది మరచి.. ఆ కుక్కను ఊరి బయట వదిలిపెట్టాలనుకున్నాడు. కుక్క మూతికి తాడు కట్టి దానిని తన కారుకు కట్టేసి ఊరంతా పరిగెత్తించాడు. తాడు పొడవు ఎక్కువగా ఉండటంతో శునకం అటూ ఇటూ ఊగుతూ రోడ్డుపై పేరుగెత్తింది. ఓ సమయంలో కారు వేగంతో సరిగా పరుగెత్తలేకపోయింది.
మరికొంత సమయం తర్వాత కుక్క అత్యంత ప్రమాదకరస్థితిలో కన్పించింది. రోడ్డుపై వెళ్తోన్న ఓ బైకర్.. కుక్క పరుగెత్తలేకపోతుంది అని రజనీశ్ గల్వాకు చెప్పినా అతడు ఆగలేదు. అనంతరం కొందరు స్థానికులు కారును అడ్డగించి కుక్కను విడిపించారు. ఆ తర్వాత ఎన్జీవో (డాగ్ హోమ్ ఫౌండేషన్)కు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన ఎన్జీవో శునకాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కుక్కకు కాలు విరగడంతో పాటు మెడ మీద తీవ్ర గాయమైనట్లు ఎన్జీవో తెలిపింది.
ఎన్జీవో సంస్థ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసి పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. డాక్టర్ రజనీశ్ గల్వాపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. అంతేకాదు అతడి లైసెన్సును రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు వైద్యుడిపై జంతుహింస చట్టం కింద కేసు నమోదు చేశారు. బైకర్ తీసిన ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందరూ రజనీశ్ గల్వాపై విరుచుకుపడుతున్నారు.
Also Read: యువరాజ్ సింగ్ పెను విధ్వంసం.. 6 బంతుల్లో 6 సిక్సులు! 12 బంతుల్లో హాఫ్ సెంచరీ
Also Read: Varun Tej 13: ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా వరుణ్ తేజ్.. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా మూవీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి