UP Police Fighting Video: ఇద్దరు పౌరులు కొట్టుకుంటే ఆపాల్సిన పోలీసులే పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు. అది కూడా పట్టపగలే నడిరోడ్డుపై పెట్రోలింగ్ జీప్ ఆపి మరీ ఒకరినొకరు తన్నుకున్నారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే.. విధి నిర్వహణలో ఉన్న ఆ ఇద్దరూ ఆ సమయంలో తాగిన మైకంలో ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు కొట్టుకుని, తన్నుకుంటున్న సమయంలోనే అటుగా వెళ్లే వాళ్లెవరో ఈ వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది.. ఈ పోలీసులు ఎవరు అనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం. ఉత్తర్ ప్రదేశ్‌లోని జలాన్‌లో గత వారం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిలో కానిస్టేబుల్ ధరమ్‌వీర్‌కి, హోమ్ గార్డు సునీల్ కుమార్‌కి మధ్య ఏదో విషయంలో వివాదం తలెత్తింది. ఆ వివాదం కాస్తా... చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో నడిరోడ్డుపైనే పెట్రోలింగ్ వాహనం నిలిపిన సిబ్బంది అందులోంచి దిగి బయటికొచ్చి ముష్టి యుద్ధం చేయడం ప్రారంభించారు. '' తూ కిత్తారే.. అంటే తూ కిత్తారే '' అని బూతులు తిట్టుకుంటూ తన్నుకోవడం మొదలుపెట్టారు. మద్యం మత్తులో తాము పోలీసుల అని.. అది కూడా యూనిఫామ్ ధరించి ఉన్నామనే విషయం కూడా మర్చిపోయారు. నలుగురు చూస్తే నవ్వుల పాలవుతాం అనే ఇంగిత జ్ఞానం లేకుండా కొట్టుకున్నారు. బూతులు తిట్టుకున్నారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి