Dry days in august shops will be closed for two days independence day and Janmashtami: సాధారణంగా కొన్ని ముఖ్యమైన పండుగల సమయంలో, అదే విధంగా మనదేశానికి చెందిన ఉత్సవాల సమయంలో లిక్కర్ షాపులను మూసి ఉంచుతుంటారు. ప్రస్తుతం భారత్ లో 78 వ ఇండిపెండెన్స్ డే వేడుకలకు అన్నిరకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతేకాకుండా.. ప్రధాని మోదీ మూడోసారి ఇటీవల సార్వత్రిక ఎన్నికలలో విజయఢంకా మోగించారు. ఈ నేపథ్యంలో ఎర్రకోటపై 11 వసారి జాతీయ జెండాను ఆవిష్కరణకు రెడీగా ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో ఇండిపెండెన్స్ డే సందర్బంగా దేశంలోని అన్నిరకాల వైన్స్, లిక్కర్ షాపులు బంద్ ఉండనున్నాయి. ముఖ్యంగా ఆగస్టు 15, జన్మాష్టమి నేపథ్యంలో రెండు రోజుల పాటు తప్పనిసరిగా లిక్కర్ షాపులు చాలా రాష్ట్రాలలో బంద్ ఉండనున్నాయి. కొందరు మందుబాబులు.. తాగి పండగ పూట రోడ్డుమీద న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటారు. ఇండిపెండెన్స్ డే.. అనగానే.. అన్ని పాఠశాలలు కూడా విద్యార్థులు ఊరంతా ప్రభాత్ భేరినిర్వహిస్తుంటారు. యూనీఫామ్ లు ధరించి, దేశంకోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకుంటూ, జై జవాన్ , జై కిసాన్ అంటూ నినాదాలు చేసుకుంటూ విద్యార్థులు వెళ్తుంటారు. గ్రామంలో ప్రధాన రహాదారుల్లో కూడా జాతీయజెండాలను ఆవిష్కరిస్తారు.


అందుకే ఆ రోజున ఎక్కడకూడా మందు షాపులు తెరిచి ఉండొద్దని ప్రభుత్వాలు మద్యం షాపులకు ఆదేశాలు జారీచేశాయి. కొంత మంది మందుబాబులు సమయం, సందర్భం లేకుండా రెచ్చిపోతుంటారు. తాగి రోడ్ల మీద నానా రచ్చ చేస్తుంటారు. దీని వల్ల ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.అందుకు ప్రభుత్వాలు , ముఖ్యమైన పండుగలు, ఏదైన అల్లర్లు, శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలు తలెత్తినప్పుడు మద్యం దుకాణాలను బంద్ చేయిస్తుంటారు. చాలా మంది మద్యం మత్తులో ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తుంటారు. తాగి రోడ్లమీద రచ్చ చేస్తుంటారు.


Read more: Vikram: తీన్మార్ స్టెప్పులేసిన హీరో విక్రమ్.. గుంటూరు వీవీఐటీలో మూవీ యూనిట్ సందడి.. వీడియో వైరల్..  


ఈ క్రమంలో ఆగస్టు 15, జన్మాష్టమి నేపథ్యంలో 26 న మద్యం దుకాణాలు బంద్ చేసి ఉంటాయని తెలుస్తోంది. దీంతొ మందుబాబులు దీన్ని బిగ్ షాక్ గా భావిస్తారని చెప్పుకోవచ్చు.   ఎందుకంటే.. మందుబాబులు, చాలా మంది మద్యానికి బానిసలా మారిపోతుంటారు. వీరికి ప్రతిరోజు మందులేనిది రోజుగడవదు. లిక్కర్ కు పూర్తిగా అడిక్ట్ అయిపోతుంటారు. మరికొందరు ఇలాంటి బంద్ లు ఉంటే..మందు జాగ్రత్తగా ఇంట్లో ఎక్కువగా స్వాక్ తెప్పించుకుని మరీ అలర్ట్ గా ఉంటారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter