Duck Vs Tigers: పులిని చూస్తే ఏ జంతువుకైనా హడలే. చాలా సందర్భాల్లో చిన్న చిన్న జంతువుల్ని పట్టుకునేందుకు సైతం ఆ పులులకు తలప్రాణం తోకకొస్తుంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అత్యంత తెలివైన జంతువు పులి. క్షణకాలంలో వేట ముగించేస్తుంది. అందుకే పులిని చూస్తే ఏ జంతువుకైనా వణుకు పుడుతుంది. పెద్ద పెద్ద జంతువులు సైతం పులిని చూసి భయపడతాయి. అడవికి రాజు సింహమైనా..పులి కూడా తక్కువేం కాదు. 


చాలా సందర్భాల్లో చిన్న చిన్న జంతువుల్ని పట్టుకునేందుకు పులులకు తలప్రాణం తోకకు వస్తుంటుంది. చాలా కష్టపడాల్సి వస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అటువంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ విడియో చూస్తే..ఆ పులిపై కూడా మీకు జాలి కలుగుతుంది. ఏకంగా మూడు పులులు కలిసి..ఓ చిన్న బాతును పట్టుకునేందుకు ఎంత ఇబ్బంది పడుతున్నాయో చూడవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 


ఓ కొలనులో ఉన్న చిన్న బాతును వేటాడేందుకు మూడు పులులు అందులో..దిగుతాయి. మూడు పులులు కలిసి ఆ బాతును పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేయడం వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. బాతుకి, పులులకు మధ్య చాలాసేపు దొంగా పోలీసాట వ్యవహారం నడుస్తుంది. ఎట్టకేలకు చివర్లో ఓ పులి కాస్త తెలివిగా ఆలోచించి బాతును పట్టుకుని ఆహారంగా మార్చుకుంటుంది. 



ఈ వీడియోను beauty.wildlifee పేరుతో ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అప్‌లోడ్ చేశాడు. ప్రారంభంలో బాతు మూడు పులుల్ని ఎంతలా తప్పించుకుంటూ సాగిందో చూడవచ్చు. పులి పట్టుకోడానికి సిద్ఘం కాగానే..నీటిలో మునిగిపోవడం..తిరిగి కాస్త దూరంలో పైకి తేలడం,,మళ్లీ నీటిలోకి మునగడం ఇలా ముప్పుతిప్పలు పెడుతుంటుంది.


Also read: Viral video: ప్రేమికుల మధ్య పెట్రోల్ చిచ్చు.. ప్రేయసిని కలవలేక ప్రియుడి కష్టాలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook