Earth Breathing Like Human Video got Viral: మనుషులు, జంతువులు, పక్షులు, క్షీరదాలు సహా ఈ భూ ప్రపంచంలోని సమస్త జీవరాశులు ఊపిరి పీల్చుకుంటాయన్న విషయం తెలిసిందే. ఇది జగమెరిగిన సత్యం కూడా. ఈ ప్రపంచంలోని ప్రతి జీవి ఊపిరి పీల్చుకోవడం నిత్యం మనం కళ్లారా చూస్తూనే ఉంటాం. అయితే 'భూమి' ఊపిరి పీల్చుకోవడం (Earth Breath) ఎప్పుడైనా చూశారా?, కనీసం ఆ వార్త అయినా ఎక్కడైనా విన్నారా?.. లేదు కదా?. భూమి శ్వాస ప్రక్రియ గురించి వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే భూమి పీల్చుకోవడంకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వింతలు జరుగుతుంటాయి. ప్రతి అద్భుతాన్ని మనం కళ్లారా చూడలేము. అయితే ఆ సంఘటనల వీడియోలను మాత్రం మనం చూడవచ్చు. సోషల్ మీడియా పుణ్యామాని భూమి ఊపిరి (Earth Breathing Viral Video) పీల్చుకుంటున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. పచ్చని చెట్ల మధ్య అందమైన దృశ్యం కనిపిస్తుంది. ఈ చెట్ల మధ్య ఒక నిర్దిష్ట భూభాగం మాత్రమే పైకి లేచి మరలా సాధారణ స్థితికి చేరుకుంటుంది. భూమి ఊపిరి తీసుకున్నపుడు కొంత భాగం పైకి లేస్తుంది. ఇది మనిషి సాధారణ శ్వాస ప్రక్రియగా పరిగణించబడుతుంది.


ఈ వీడియో చేసేవారిని చాలా ఆశ్చర్యపరుస్తుంది. ఈ వీడియో మొదటిసారి చూస్తే మాత్రం భూమి ఊపిరి పీల్చుకుంటుందా? అని అనుకుంటాం. లేదా భూమి ఊపిరి పీల్చుకుంటుందా? అని మనల్ని ఆలోచించేలా చేస్తుంది. ఈ వీడియో కెనడాలోని క్యూబెక్‌లో తీయబడింది. ఇక్కడ భూమి ఊపిరి పీల్చుకోవడం లేదు. బలమైన ఈదురు గాలులకు చెట్లు ఊగుతున్నాయి. దాంతో చెట్ల వేర్లు బయటకు వస్తున్నాయి. 



Also Read: Tata Nexon Facelift 2023: సరికొత్త టాటా ఎస్‌యూవీ వచ్చేస్తోంది.. ఫీచర్లు లీక్! ఇక క్రెటా, బ్రెజాలకు టాటా చెప్పాల్సిందే


ఈ వీడియోను అమేజింగ్ నేచర్ (Amazing Nature) అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను 2022 మార్చి 19న ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నిజానికి ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతుంది. ఈ వీడియో చుసిన వారు షాక్ అవుతున్నారు. అంతేకాదు ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంది. మీరు వీడియో చూసి ఎంజాయ్ చేయండి. 


Also Read: Anushka Sharma Cheerleader: భర్త కోసం చీర్‌లీడర్‌గా మారిన అనుష్క శర్మ.. వైరల్ పిక్స్!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి