ప్రజాస్వామ్యం చనిపోయింది: విశాల్ ట్వీట్
విశాల్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ.. 10 మంది సంతకాలు చేయాల్సి ఉండగా.. కేవలం 8 సంతకాలు మాత్రమే అసలవని తేలిందని.. మరో ఇద్దరు తమ సంతకాలు ఫోర్జరీ చేశారని ఫిర్యాదు చేశారని తెలపడం వల్ల విశాల్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తున్నామని ఎన్నికల సంఘం తెలిపింది.
తమిళ హీరో విశాల్ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రకటించారు. ఆర్కే నగర్ నియోజకవర్గం నుండి బైపోల్స్‌లో ఆయన పోటీ చేయనున్నట్లు కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. విశాల్ చేసిన ఆ ఒక్క ట్వీట్ బాగా వైరల్ అయ్యింది. అనుకున్న విధంగానే ఆయన 4 డిసెంబరు తేదీన నామినేషన్ దాఖలు చేశారు. అయితే, కొన్ని గంటల క్రితం అదే నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది.
విశాల్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ.. 10 మంది సంతకాలు చేయాల్సి ఉండగా.. కేవలం 8 సంతకాలు మాత్రమే అసలవని తేలిందని.. మరో ఇద్దరు తమ సంతకాలు ఫోర్జరీ చేశారని ఫిర్యాదు చేశారని తెలపడం వల్ల విశాల్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తున్నామని ఎన్నికల సంఘం తెలిపింది.
ఆర్కే నగర్ బైపోల్స్‌లో అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనగోడలు దీపా జయకుమార్ నామినేషన్ కూడా ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఎన్నికల సంఘం తన నామినేషన్ తిరస్కరించడంతో విశాల్ మళ్లీ సోషల్ మీడియా వేదిక ద్వారా ఈసీపై మండిపడ్డారు. అమ్మ చనిపోయింది.. ప్రజాస్వామ్యం కూడా చనిపోయింది అని ట్వీట్ చేశారు.