Horrible Elephant attck in kerala: చాలా మంది తమ ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకుంటారు. ఆవులు, గేదెలు, ఎద్దులు, ఏనుగులు తదితర జంతువులను పెంచుకుంటుంటారు.ఈ జంతువులు సాధారణంగా ఎంతో శాంతంగా కనిపిస్తుంటాయి. వీటిని తమ ఇంట్లోని వాళ్లలాగా పెంచుకుంటారు. మంచి ఫుడ్ ఇస్తారు. వెటర్నరీ దగ్గరకు తీసుకెళ్తుంటారు.  ఇదంతా మనం చూస్తుంటాం. అయితే.. ఎంతో సహనంగా ఓపిగ్గా కనిపించే జంతువులు, కొన్నిసార్లు బీభత్సం సృష్టిస్తుంటాయి. తమ ముందు ఉన్న వారి మీద దాడులు చేస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



కొమ్ములతో దాడికి పాల్పడుతుంటాయి. కొన్నిసార్లు ఆవులు,గేదెలు మార్కెట్ లలో, రోడ్డు మీద హల్‌చల్  చేసిన ఘటనలు అనేకం వార్తలలో నిలిచాయి. ఏనుగులు కూడా కొన్నిసార్లు, ఉత్సవాల సమయంలో, హల్ చల్ చేస్తుంటాయి. మావటి వాళ్లమీద దాడులకు తెగబడుతుంటాయి. ఇలాంటి విషాదకర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. 


పూర్తివివరాలు..


కేరళలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అడిమాలికి సమీపంలోని కల్లార్‌ ప్రాంతంలో జూన్ 20న ఈ ఘటన చోటు చేసుకుంది. టూరిస్టులను సఫారీకి తీసుకెళ్లేందుక ఈ ప్రాంతంలో చాలా ఏనుగులను ఉంచుతుంటారు. ఈ క్రమంలో బాలకృష్ణన్ (60) అనే మావటి.. ఓ ఏనుగు వద్దకు వెళ్లి కర్రతో ట్రైనింగ్ ఇస్తున్నాడు. తన చేతిలోని కర్రతో ఏనుగు కాళ్లపై సున్నితంగా కొడుతూ ఏనుగు సరిగ్గా నిలబడేలా ఆర్డర్ వేస్తున్నాడు. అయితే ఈ క్రమంలో ఏనుగుకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది.


వెంటనే మావటిపై దాడి చేసి కాళ్ల కింద అతడిని ఒత్తిపడేసింది. తన రెండు కాళ్లను బలంగా మోపి బలంగా తొక్కింది. అంతటితో ఆగకుండా అతడి వీపుపై కూడా కాళ్లు మోపి తొక్కడంతో మావటి.. అక్కడికక్కడే చనిపోయాడు. ఏనుగు దాడి చేయడాన్ని గమనించిన మరో మావటి పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. అయితే అప్పటికే బాలకృష్ణన్ మృతి చెందాడు. ఈ షాకింగ్ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు మాత్రం సీరియస్ గా స్పందించారు.


Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..


ఏనుగులను అక్రమంగా సఫారీకిలకు తీసుకెళ్తున్నట్లు బైటపడింది. ఈ జిల్లాలో చాలా ఏనుగు సఫారీ కేంద్రాలకు అనుమతి లేనట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్ల రూపంలో స్పందింస్తున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి