Woman on Burj Khalifa: ఎమిరేట్స్ విమానయాన సంస్థ కోసం.. గత ఏడాది ఆగస్టులో బుర్జ్‌ ఖలీఫా చిట్ట చివరణ నిలబడి ఓ మోడల్​ చేసిన యాడ్​ చేసిన (Emirates viral ad) యాడ్ గుర్తుందా? అప్పట్లో ఈ యాడ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా అదే మోడల్​, అదే విమానయాన సంస్థకోసం మరోసారి ఆ ఫీట్​ను (Woman stands on top of Burj Khalifa again) చేసింది. ఆ మోడల్ పేరు నికోల్‌ స్మిత్‌ లడ్విక్‌. ఈమె ప్రముఖ స్టై  డైవింగ్​ ఇన్​స్ట్రక్టర్​.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సారి ప్రకటనలో మరో అద్భుతాన్ని చేయడం గమనార్హం. బుర్జ్​ ఖలీఫాపై మోడల్ నికోల్‌ స్మిత్‌ లడ్విక్‌.. ఆమె చుట్టు ఎమిరేట్స్​ ఏ380 విమానం కూడా చక్కర్లు కొట్టింది. దీనితో మరోసారి ఈ యాడ్​ వైరల్​గా (Emirates viral ad) మారింది.


ఈ సారి యాడ్ గురించి...


దూబాయ్ వేదికగా జరుగుతున్న 'దుబాయ్​ ఎక్స్​పో 2020' ప్రమోషన్స్​లో భాగంగా మరోసారి యాడ్​ చేయించింది యూనైటైడ్​ అరబ్ ఎమిరేట్స్​. ఈ యాడ్​లో నికోల్​ స్మిత్ లాడ్విక్​ ఎక్స్​పో కోసం ఆహ్వానానాన్ని పలికే ప్లకాడ్లను (DUBAI EXPO 2020) ప్రదర్శించింది.


'ఇందులో నేనింకా ఇక్కడే ఉన్నాను'.. 'వావ్​! నేను దుబాయ్ ఎక్స్​పో చూస్తున్నాను'.. 'చివరగా ఇక్కడ వరల్డ్​ గ్రేటెస్ట్​ షోకు రండి మిత్రులారా'.. 'ఐకానిక్ ఎమిరేట్స్ ఏ380 విమానంలో ఎగురుతూ వచ్చేయండి ' అనే ప్లకార్డులను ప్రదర్శించింది. ఇదే సమయంలో అమె వెనకవైపు నుంచి ఓ ఏ380 విమానం కూడా వెళ్లడం విశేషం.



ఎమిరేట్స్ విమాన సంస్థ క్రూ యూనిఫామ్​లో దరించి ఉన్న నికోల్​ స్మిత్ లాడ్విక్​.. 830 మీటర్ల ఎత్తులో కూడా చిరునవ్వులు చిందిస్తూ కనిపించడం విశేషం. ఏ మాత్రం భయం లేకుండా అమె చేసిన ఈ సహాసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ యాడ్​ ఇప్పుడు సోషల్​ మీడియాలో తెగ వైరల్ (Burj Khalifa viral video) అవుతోంది.


Also read: Instagram Nationality Challenge: ఇన్​స్టాలో నేషనాలిటీ ఛాలెంజ్​ వీడియో ఎలా చేయాలి?


Also read: Parrot Viral Video: ఐఫోన్ రింగ్ టోన్ ను అనుకరించిన అందమైన చిలుక.. వీడియో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook