Facebook Data Leak: ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్ యూజర్ల డేటా లీకైందన్న సమాచారం కలకలం కల్గిస్తోంది. వ్యక్తిగత సమాచారం, ఫోన్ నెంబర్ అన్నీ ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచినట్టు కూడా సమాచారం. ఇదే ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫేస్‌బుక్ యూజర్ల డేటా ( Facebook users Data) లీకైందా..ఇదే ఇప్పుడు కలకలం కల్గిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల యూజర్ల ఫేస్‌బుక్ డేటా లీకైందనే సమాచారం వస్తోంది. హ్యాకర్ల కోసం ఫేస్‌బుక్ డేటాను ఓ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు కూడా సమాచారం. ఫేస్‌బుక్ డేటా లీక్ కావడమనేది పాత విషయమే అయినప్పటికీ భారీ ఎత్తున లీకైందన్న విషయం ఆందోళన కల్గిస్తోంది. ఒక్క భారత్ నుంచే 60 లక్షల ఫేస్‌బుక్ యూజర్ల సమాచారం ఆన్‌లైన్‌లో వేలానికి సిద్ధంగా ఉందనే వార్తల నేపధ్యంలో ఫేస్‌బుక్ యూజర్లలో కలకలం రేగుతోంది. 


ప్రపంచ వ్యాప్తంగా 106 దేశాలకు చెందిన ఫేస్‌బుక్ (Facebook) యూజర్ల డేటా లీక్ అయిందని తెలుస్తోంది. ఇందులో ఫోన్ నెంబర్లు, ఫేస్‌బుక్ ఐడీలు, పూర్తి పేరు, లొకేషన్, పుట్టిన తేదీ, ఇ మెయిల్ అడ్రస్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయిట. ఫేస్‌బుక్ డేటా లీక్ కారణంగా 1.1 కోట్ల యూజర్లు ప్రభావితమయ్యారని సమాచారం. యూఎస్ నుంచి 32.3 మిలియన్ల యూజర్లు లీక్ వలలో చిక్కుకోగా..యూకే నుంచి 11.5 మిలియన్ల డేటా లీకైంది.టెలీగ్రామ్ బాట్ ద్వారా ఈ లీకేజ్ వ్యవహారం జరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇండియాలో 6 మిలియన్ల డేటా లీకైనట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఫేస్‌బుక్ డేటా లీక్ (Facebook Data leak) వ్యవహారం ఇప్పటిది కాదు. చాలాకాలంగా ఉన్నదే.ఫేస్‌బుక్ 2018లో ఫోన్ నెంబర్ల ద్వారా యూజర్లను సెర్చ్ చేసే ఆప్షన్ తీసివేసింది. కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదం ( Cambridge analytica dispute) నేపధ్యంలో ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో 8.7 కోట్ల ఫేస్‌బుక్ యూజర్ల సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికా సేకరించిందన్న వార్తలు వివాదం రేపాయి. అయితే ఇప్పుడు కొత్తగా విన్పిస్తున్న ఫేస్‌బుక్ డేటా లీక్ వ్యవహారం పాత విషయమని..కొత్త సమస్య కాదని ఫేస్‌బుక్ చెబుతోంది. 


Also read : Vodafone idea Bumper Offer: వోడాఫోన్ ప్రీ పెయిడ్‌పై అద్భుత ఆఫర్..ఇలా రీఛార్జ్ చేస్తే క్యాష్‌బ్యాక్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook