Facebook Anniversary: `ఫేస్బుక్`కు 20 వసంతాలు.. సామాజిక దిగ్గజ చరిత్ర తెలుసా..?
Facebook 20th Anniversary: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ 20 వసంతాలు పూర్తి చేసుకుంది. రెండు దశాబ్దాల పాటు ప్రజలకు వినోదం అందిస్తున్న దిగ్గజం సామాజిక మాధ్యమంగా ఫేస్బుక్ కొనసాగుతోంది. 20వ వార్షికోత్సవం సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
Facebook Anniversary: ప్రజలు తమ అభిప్రాయాలు, తమ ఫొటోలు తదితర విషయాలు పంచుకునేందుకు చక్కటి వేదిక ఫేసుబుక్. ఇప్పుడైతే అనేక సోషల్ మీడియా యాప్‌లు ఉన్నాయి. కానీ అప్పట్లో ఉన్న ఒకే ఒక సాధనం ఫేసుబుక్. ప్రజలందరికీ అత్యంత వినోదాన్ని పంచిన ఫేసుబుక్ ప్రారంభమై 20 ఏళ్లు పూర్తయ్యింది. రెండు దశాబ్దాలుగా వినియోగదారులకు వినోదం అందిస్తూ ఫేసుబుక్ ఇంకా కొనసాగుతున్నది. ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ ఖాతాదారుల అభిరుచికి తగ్గట్టు ఫేసుబుక్ రూపాంతరం చెందుతోంది. దీంతో కొత్తగా వచ్చిన సోషల్ మీడియా యాప్‌ల నుంచి పోటీని తట్టుకుని ఫేసుబుక్ నిలబడుతోంది.
Also Read: UBI Recruitment: అదిరిపోయే ఉద్యోగం.. ఈ జాబ్‌కు ఎంపికైతే తొలి జీతమే రూ.90 వేలు
ఫేసుబుక్ 20 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు, మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఓ ఆసక్తికర పోస్టు చేశాడు. '20 ఏళ్ల ఫేసుబుక్ అద్భుతమైన రోజులకు తీసుకెళ్లింది' అని రాసి ఓ ఫొటోను పంచుకున్నాడు. '2004లో నా ఫేసుబుక్ ప్రొఫైల్' అంటూ ఇరవయ్యేళ్ల కిందట చేసిన పోస్టును పోస్టు చేశాడు. జుకర్‌బర్గ్ చేసిన పోస్టుకు నెటిజన్లు యమ లైక్‌లు చేస్తున్నారు. 'గొప్ప చిత్రం', 'థ్యాంక్స్ జుకర్‌బర్గ్ అద్భుతమైన యాప్‌ను అందించావు' అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Also Read: Cricket Match: ప్రాణం తీసిన క్రికెట్ మ్యాచ్.. సరదాగా మొదలైన గొడవ కాస్త విషాాదాంతం
ఫేసుబుక్ ప్రస్థానం
అమెరికాకు చెందిన మార్క్ ఎలియట్ జుకర్‌బర్గ్ 4 ఫిబ్రవరి 2004లో ఫేసుబుక్‌ను స్థాపించాడు. తన స్నేహితులతో కలిసి ఓ ఇంటిలో దీన్ని ప్రారంభించగా.. ఆ తర్వాత ఆ ఇల్లు కాస్త కార్యాలయంగా మారింది. ఆ సంస్థకు సీఈఓ, వ్యవస్థాపకుడు, అధ్యక్షుడిగా కొనసాగారు. 'ది ఫేసుబుక్' అని పేరిట ఫేసుబుక్‌ను జుకర్‌బర్గ్ ప్రారంభించారు. ఈ సంస్థ ప్రారంభించేందుకు జుకర్ తన చదువును మధ్యలో వదిలేశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేస్తున్న కోర్సు నుంచి పక్కకు తప్పుకున్నారు. కష్టపడి పనిచేసి నేడు ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా జుకర్‌బర్గ్ నిలిపారు. ఫేసుబుక్ పేరును 2021లో మెటా లేదా మెటా ప్లాట్‌ఫార్మ్స్‌గా మార్చారు.
ఫేసుబుక్‌ను చిన్న పిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు వినియోగిస్తున్నారు. 21 జనవరి 2010న ఫేసుబుక్ వినియోగదారుల సంఖ్య 500 మిలియన్లు దాటింది. సోషల్ మీడియా అల్గారిథమ్‌లను ఇప్పుడు ఏఐ నిర్ణయిస్తోంది. మీరు ఏమీ చూస్తున్నారో ఏఐ మీకు సరిగ్గా చూపుతోంది. మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, సెర్చ్ హిస్టరీ ఉపయోగిస్తారు. ఫేసుబుక్ 20వ వార్షికోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి