Fastag Scam Fact Check: ఫాస్ట్ ట్యాగ్ స్కామ్ గురించి తాజాగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. రద్దీగా ఉండే రెడ్ లైట్ సిగ్నల్స్ వద్ద కొంత మంది కుర్రాళ్లు అక్కడ నిలిచే వాహనాలు.. ముఖ్యంగా కార్ల అద్దాలు తుడిచినట్టుగా నటిస్తూ ఆ కార్లపై ఉన్న ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్లను తమ చేతికి ఉండే స్మార్ట్ వాచ్‌ లాంటి పరికరాల సహాయంతో స్కానింగ్ చేస్తూ వారి పేటీఎం ఖాతాల్లో ఉండే మొత్తాన్ని దోచుకుంటున్నారనేది ఆ వైరల్ వీడియోల సారాంశం. ఈ వీడియోలు చూసిన జనం, నెటిజెన్స్ ఆందోళనకు గురవుతున్నారు. తమ పేటీఎం ఖాతాలో కూడా సొమ్ము గుల్ల అవుతుందా అని విచారం వ్యక్తంచేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు ఈ వీడియోలో ఏముందంటే..
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ పిల్లాడి వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను నిశితంగా పరిశీలిస్తే.. కారు విండ్ షీల్డ్ అద్దాలు తుడవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా నటిస్తున్న ఓ పిల్లాడు.. ఆ కారు అద్దంపై ఉన్న ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్‌ను తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్‌ తరహా పరికరంతో స్కానింగ్ చేసినట్టుగా కనబడుతుంది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా వచ్చి తమతో మాట్లాడుతున్న ఆ పిల్లాడిని కారులో ఉన్న వాళ్లు నిలదీయబోగా.. అతడు పారిపోవడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఆ బాలుడిని పట్టుకునేందుకు అతడి వెంటే పరిగెత్తిన యువకుడు నిరాశతో తిరిగిరావడం, ఆ తర్వాత ఫాస్ట్ ట్యాగ్ స్కామ్ ఇలా జరుగుతోందంటూ డ్రైవింగ్ సీటులో కూర్చున్న వ్యక్తి వివరించడం కూడా ఈ వీడియోలో చూడొచ్చు.



సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలు చూసి జనం బెంబేలెత్తిపోతుండటంతో ఇందులో నిజం ఎంత ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది మా జీ తెలుగు న్యూస్ టీమ్. ఇదే విషయమై ఇంటర్నెట్‌లో శోధించగా అప్పుడు అసలు విషయం తెలిసింది. 


అసలు నిజం ఏంటంటే..
ఈ పుకార్లపై స్పందించిన ఫాస్టాగ్.. కేవలం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( ఎన్‌పీసీఐ ) వద్ద నమోదైన టోల్ ప్లాజా, పార్కింగ్ ప్లాజా మర్చంట్స్‌కి మాత్రమే ఫాస్టాగ్ స్టాన్ చేసి డబ్బులు తీసుకునే అధికారం ఉంటుందని.. అది కూడా ఎక్కడైతే లావాదేవీలు చేసేందుకు వారికి అనుమతి ఇస్తారో అక్కడ మాత్రమే ఈ స్కానింగ్ పనిచేస్తుందని స్పష్టత ఇచ్చింది. అనధికార పరికరాలు ఏవీ ఫాస్టాగ్‌లోంచి డబ్బులు డ్రా చేయలేవు అని ఫాస్టాగ్ తేల్చిచెప్పింది. 


ఈ వైరల్ వీడియోపై ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం సైతం స్పందించింది. ఇదొక ఫేక్ వీడియో అని.. ఇందులో నిజం లేదని పీఐబి క్లారిటీ ఇచ్చింది. 



అంతేకాదండోయ్.. ఈ వీడియో చూసి పేటీఎం యూజర్స్ ఆందోళన చెందుతుండటంతో పేటీఎం సైతం దీనిపై స్పందించింది. స్మార్ట్ డివైజ్‌తో స్కానింగ్ చేసి ఫాస్టాగ్ ప్రీపెయిడ్ ఎకౌంట్ నుంచి డబ్బులు దోచుకుంటున్నారనే ప్రచారంలో నిజం లేదని వెల్లడించింది. 



మొత్తంగా ఈ వైరల్ వీడియో ఒక ఫేక్ వీడియో.
అలాంటి అనధికారిక చెల్లింపులు అసాధ్యం.
ప్రతీ టోల్‌ప్లాజా, పార్కింగ్ ప్లాజాలకు ఓ ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది. దాంతో తప్ప మరే ఇతర మార్గాల్లోనూ డబ్బులు డ్రా చేయడం కుదరదు.


Also read : SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త..అందుబాటులోకి మరిన్ని సేవలు..!


Also read : 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, 40 వేలు పెరగనున్న జీతం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.