Fake News Alert: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. అలియా భట్-రణబీర్ కపూర్‌ల కుమారుడిగా పునర్జన్మ పొందబోతున్నట్లు జీ న్యూస్ పేరిట సోషల్ మీడియాలో ఓ స్క్రీన్ షాట్ చక్కర్లు కొడుతోంది. ఆ స్క్రీన్ షాట్ పూర్తిగా ఫేక్ అని జీ న్యూస్ తెలియజేస్తున్నది. అసలు ఆ అంశంపై టీవీ ఛానెల్‌లోనూ, డిజిటల్ ఛానెల్‌లోనూ ఎటువంటి వార్తలు ప్రసారం కాలేదని స్పష్టం చేస్తున్నది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండు రోజుల క్రితం బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తాను తల్లి కాబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. త్వరలో మా పాప రాబోతుంది అంటూ అలియా ఇన్‌స్టాలో పెట్టిన పోస్టుతో ఈ విషయం వెల్లడైంది. ఆ పోస్టుకు జతచేసిన ఫోటోలో అలియా బెడ్‌పై పడుకుని ఉండగా.. పక్కనే రణబీర్ కూర్చొని ఉన్నాడు. అలియా షేర్ చేసిన మరో ఫోటోలో రెండు పెద్ద సింహాలు, ఒక బుల్లి సింహం ఉన్నాయి. తమకు బిడ్డ పుట్టబోతున్నట్లు సింబాలిక్‌గా ఆ ఫోటో ద్వారా చెప్పారు.


అలియా తాను తల్లి కాబోతున్నట్లు వెల్లడించాక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆమె కడుపున పుట్టబోతున్నట్లు జీ న్యూస్ పేరిట సోషల్ మీడియాలో ఓ స్క్రీన్ షాట్ వైరల్‌గా మారింది. ఆ స్కీన్‌ షాట్‌కి, జీ న్యూస్‌కి ఎటువంటి సంబంధం లేదు. అది పూర్తిగా ఫేక్ అని గమనించగలరు.


కాగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం బాలీవుడ్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ముంబైలోని తన నివాసంలో జూన్ 14, 2020న సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. ముంబై పోలీసులు సుశాంత్‌ది ఆత్మహత్యేనని తేల్చారు. అనేక మలుపులు తిరిగిన ఈ కేసు అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. సుశాంత్ అభిమానులు ఇప్పటికీ అతన్ని మరిచిపోలేకపోతున్నారు. బాలీవుడ్‌లో నెపోటిజమే అతన్ని చంపేసిందంటూ ఇప్పటికీ సోషల్ మీడియాలో వాపోతుంటారు. 



Also Read: Horoscope Today June 30th: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు కుటుంబ వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు


Also Read: Uddhav Thackeray Resigned: ఉద్ధవ్ థాకరే రాజీనామా.. అసెంబ్లీలో బలపరీక్షకు ముందు కీలక పరిణామం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.