Famous Astrologer Venu Swamy: రొమాంటిక్ మూడ్ లో వేణుస్వామి.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిన వీడియో..
Famous Astrologer Venu Swamy: ఫెమస్ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన రాజకీయ నాయకులకు, హీరోలు, హీరోయిన్లకు జాతకాలు చెబుతుంటారు. అంతేకాకుంగా తరచుగా సంచలన వ్యాఖ్యలు చేస్తు ఎల్లప్పులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా కూడా ఉంటారు.
Venu Swamy And Veena Srivani Reel On Rebel Star Prabhas Movie Mirchi: ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామికి ఒక రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఆయన తరచుగా సంచలన వ్యాఖ్యలు, జాతకాలు చెబుతుంటారు. ముఖ్యంగా ఆయన కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్తుందని రెండెళ్ల కిత్రమే చెప్పారు. ఆయన అన్నట్లుగా లిక్కర్ స్కామ్ లో ఈడీ కవితను అరెస్టు చేసి కోర్టులో హజరుపరిచారు. ప్రస్తుతం ఆమె తీహార్ కోర్టులో రిమాండ్ ఉంది. ఇదిలా ఉండగా.. విజయ దేవర కొండ, రష్మికల విషయంలో కూడా వీరీ లవ్ స్టోరీలపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ పెళ్లి గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు పదవి గండం ఉందని కూడా ఆయన చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే ప్రస్తుతం బీఆర్ఎస్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. దీంతో ఆయనకు ప్రస్తుతం విపరీమైన స్టార్ డమ్ వచ్చిపడింది.
పలుమార్లు ఆయనదగ్గర పూజలు చేసుకున్న హీరోయిన్లు ఓవర్ నైట్ లో మంచి అవకాశాలు వచ్చి, జీవితంలో సెటిల్ అయ్యారని కూడా ఆయన చెబుతుంటారు. ఇక కొందరు ఆయనంటే గొట్టని వాళ్లు తరచుగా వేణుస్వామిని టార్గెట్ గాచేసుకుని పోస్టులు, వీడియోలు పెడుతూ.. ఆయనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. వేణుస్వామి సైతం వారికి అంతే రేంజ్ లో కౌంటర్ ఇస్తుంటారు. వేణుస్వామి పచ్చి తాగుబోతు అని, ఆయనకు వైన్ షాపులు, బ్లాక్ దందా ఉందని కూడా కొందరు ఆరోపణలు చేస్తుంటారు. ఈక్రమంలో తాజాగా వేణు స్వామి, ఆయన సతీమణి వీణ శ్రీవాణితో కలిసి తీసిన రీల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వేణు స్వామి, ఆయన సతీమణి వారి ఇంట్లో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలోని అనుష్క, ప్రభాస్ మధ్య జరిగిన సంభాషణ మీద చేసిన రీల్ వైరల్ గా మారింది. మిర్చిలో ప్రభాస్ కు.. అనుష్క ప్రేమిస్తుంది. ఆమె తన ప్రేమను ఇండైరెక్ట్ గా ప్రభాస్ కు తెలిసేలా, తన లైఫ్ లో ఎవరైన అమ్మాయిందా అని ఆరాతీస్తుంది.
Read More: Phone Addiction: ఇదేం విడ్డూరం.. చిన్నారిని ఆ పనిచేస్తూ ఫ్రిడ్జీలో పెట్టేసిన తల్లి.. వైరల్ వీడియో..
అంతే కాకుండా.. లైఫ్ పార్టర్ కు ఎలాంటి క్వాలిటీస్ ఉంటే నచ్చుతుందో అడుగుతుంది. దీనిలో. చదువుకున్న అమ్మాయి ఉంటే బాగుంటుందని.. అనే డైలాగ్ కు.. అచ్చం వేణుస్వామి, వీణ శ్రీవాణిలు కలసి అచ్చం ప్రభాస్, అనుష్క ల మాదిరిగా నటించారు. వేణుస్వామి కూర్చీలో కూర్చుని ఉండగా, వీణ శ్రీవాణి రెడ్ కలర్ చీరలో, ఒంటి నిండా జ్యువెలరీ వేసుకుని డైలాగ్ లకు తగ్గట్టుగా యాక్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook