Farmer No Entry: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో తమ హక్కుల కోసం రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి సహకరించాల్సింది పోయి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రైతుకు తీరని అవమానం జరిగింది. వేషధారణ బాగాలేదని చెప్పి మెట్రో సిబ్బంది రైతును మెట్రో రైలును ఎక్కకుండా అడ్డుకున్నారు. రైతును స్టేషన్‌ నుంచే బయటకు పంపించారు. ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR Gifts: విద్యార్థులకు కేటీఆర్‌ 'అమూల్యమైన కానుక'.. చిన్నదే అయినా ఎంతో ప్రత్యేకం


బెంగళూరులోని రాజాజీనగర్‌ మెట్రో స్టేషన్‌కు ఆదివారం (ఫిబ్రవరి 24) కొన్ని సంచులను నెత్తిన పెట్టుకుని వచ్చాడు. రైలు ఎక్కేందుకు టికెట్‌ కొనుగోలు చేసి లోపలికి వస్తున్నాడు. అయితే సెక్యూరిటీ చెకప్‌ వద్దకు రాగానే రైతును భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. లోపలికి రానివ్వకపోవడంతో రైతు అక్కడే నిలిచిపోయాడు. ఇది గమనించిన ఇతర ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఎందుకు రానివ్వడం లేదని సెక్యూరిటీని ప్రశ్నించగా 'అతడి బట్టలు మురికిగా ఉన్నాయి' సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. బట్టలు మురికిగా ఉంటే లోపలికి రానివ్వరా ఇదేమిటి అని ప్రశ్నించారు. మేం కూడా అలాంటి బట్టలే వేసుకుని వస్తా రానివ్వరా అని నిలదీశారు. మూట కూడా అని చెప్పగా 'ఆ సంచిలో ఏమున్నాయి. బట్టలే కదా ఉన్నాయి. ఎందుకు రానివ్వరు' అని వాగ్వాదానికి దిగారు. 

Also Read: Coins In Chicken Curry: చికెన్‌ కర్రీతోపాటు 'రూపాయి బిల్లలు' ఎక్స్‌ట్రా.. ఆహారంలో కనిపించిన నాణేలు


అయితే ఆ రైతు కర్ణాటకకు చెందిన వ్యక్తి. హిందీ మాట్లాడే వ్యక్తిగా గుర్తించారు. 'రైతును అనుమతించారా? ఇదేమైనా వీఐపీ రైల్వేనా? అతడి వద్ద టికెట్‌ కూడా ఉంది. అతడిని ఫ్రీగా ఏమైనా రానిస్తున్నారా? టికెట్‌ కూడా ఉంది. మురికిగా ఉండడం కాదండి. ఆయన ఒక రైతు' అని ప్రయాణికులు సిబ్బందితో మాట్లాడారు. 'మురికి బట్టలు ఉంటే రానివ్వరా? ఇదెక్కడి నిబంధనలు. ఎక్కడ ఉన్నాయి?' అని ప్రశ్నించారు. సిబ్బంది వినకపోవడంతో రైతును ప్రయాణికులు మెట్రో స్టేషన్‌లోకి ఎక్కించారు. 'ఏం జరుగుతుందో మేం చూస్తాం' అని చెప్పి రైతును రైలు ఎక్కించారు. 'ఇది ప్రజా రవాణా. ప్రజలందరూ ఎక్కొచ్చు. బట్టలు బాగాలేకుంటే ఎక్కకూడదా' అని చెప్పారు. రైతును నిరాకరించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మెట్రో సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 






ఈ సంఘటనపై బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ స్పందించింది. 'బెంగళూరు మెట్రో ప్రజలది. రాజాజీనగర్‌ మెట్రో స్టేషన్‌లో జరిగిన సంఘటనపై విచారణ చేపడుతున్నాం. సంఘటనకు కారణమైన సూపర్‌వైజర్‌ను విధుల నుంచి తొలగించాం. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం' అని క్షమాపణలు చెప్పింది. ఈ వివాదంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అన్నం పెట్టే రైతులకు ఇలాంటి అవమానం జరగడం దారుణంగా పేర్కొంటున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook