Women Seen Thrashing Police: ఆదివారం అహ్మెదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడి రిజర్వ్ డే పద్ధతిలో నేడు సోమవారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆదివారం నాడు అహ్మెదాబాద్ స్టేడియంలో మ్యాచ్ వాయిదా పడినప్పటికీ.. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య పోరు చూడలేకపోయిన క్రికెట్ ప్రియులు మరొక పోరును వీక్షించడమే కాకుండా ఆ దృశ్యాన్ని తమ మొబైల్ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంకొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభం అవడానికంటే ముందుగా టాస్ వేయాల్సి ఉండగా.. వర్షం కారణంగా అది వాయిదా పడుతూ వచ్చింది. కావాల్సి ఉందనగా స్టాండ్స్ లో కూర్చున్న మహిళలు ఒక పోలీసుపై చేయి చేసుకున్న దృశ్యాలను అక్కడే వెనుక భాగంలో కూర్చున్న క్రికెట్ ప్రియులు తమ మొబైల్ కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


మరో అర్ధగంట అయితే టాస్ వేయాల్సి ఉందనగా 6.30 గంటలకు వర్షం మొదలైంది. దాదాపు రెండున్నర గంటలైనా వర్షానికి బ్రేక్ పడలేదు. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. కానీ స్టాండ్స్ లో కూర్చున్న మహిళా అభిమానులకు, అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్ కి మధ్య వాగ్వాదం మొదలైంది. అది కాస్తా ఘర్షణకు దారితీసింది. ఆ మహిళ అతడిని దూరంగా తోసేసింది. తుళ్లుతూ వెళ్లి దూరంగా పడిన అతడు మళ్లీ తనవైపే రావడంతో ఈసారి ముందువైపు నెట్టేసింది. ఈసారి కూడా మద్యం తాగిన వ్యక్తిలా తుళ్లుతూ వెళ్లి ముందువైపు పడ్డాడు. మూడోసారి లేచి ఆమె జోలికి వెళ్లకుండా తన దారిన తాను వెళ్లిపోయాడు. 

అసలు ఎందుకు ఆ ఇద్దరి మధ్య తోపులాట ఎందుకు జరిగింది.. ఎలా గొడవ మొదలైంది అనే ప్రశ్నలకు కారణాలు తెలియరాలేదు కానీ ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడం మాత్రం ఆగలేదు. పక్కనే కూర్చున్నప్పుడు ఏదైనా తీట పని చేసి ఉంటాడు అందుకే ఆ మహిళకు కోపం కట్టలు తెంచుకుని ఉండి ఉంటుంది అని నెటిజెన్స్ కామెంట్స్ రూపంలో తమ సందేహాలను వెలిబుచ్చుతున్నారు.